యువరాజ్ తండ్రి ఒత్తిడికి ధోని తలొగ్గాడా?
20-20లో ఆస్ట్రేలియాపై మరోసారి టీమిండియాదే పైచేయి అయ్యింది. ఆసీస్‌ను టీమిండియా మట్టి కరిపించింది. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీ ఫైనల్ చేరింది. తొలుత బ్యాంటింగ్ చేసిన ఆసీస్ 160 పరుగులు చేసింది. చేజింగ్‌కు దిగిన టీం ఇండియా తొలుత తడబడింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(13), రోహిత్ శర్మ(12), సురేష్ రైనా(10)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో విరాట్ కోహ్లి-యువరాజ్ […]
20-20లో ఆస్ట్రేలియాపై మరోసారి టీమిండియాదే పైచేయి అయ్యింది. ఆసీస్‌ను టీమిండియా మట్టి కరిపించింది. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీ ఫైనల్ చేరింది. తొలుత బ్యాంటింగ్ చేసిన ఆసీస్ 160 పరుగులు చేసింది. చేజింగ్‌కు దిగిన టీం ఇండియా తొలుత తడబడింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(13), రోహిత్ శర్మ(12), సురేష్ రైనా(10)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో విరాట్ కోహ్లి-యువరాజ్ సింగ్ ల జోడి ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టింది. జట్టు స్కోరు 94 పరుగుల వద్ద యువరాజ్ సింగ్(21) అవుట్ అయ్యాడు. విరాట్ మరోసారి తన సత్తా చాటాడు. అతడికి కెప్టెన్ ధోని కూడా తోడవడంతో భారత్ విజయం వైపు దూసుకెళ్లింది. ఐదు బంతులుండగానే లక్ష్యాన్ని చేధించింది.
అయితే మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం ఏమిటంటే యువరాజ్‌కు అవకాశాలు కల్పించడం. యువరాజ్ బౌలింగ్‌తో పాటు బ్యాంటింగ్‌కు కూడా ముందుగానే వచ్చారు. ఇలా రావడం ఆశ్చర్యం లేదు కానీ… మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్, ధోనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదివరకు మ్యాచ్‌ల్లో తన కుమారుడిని ఏడో స్థానంలో బ్యాంటింగ్‌పై పంపడంపై యోగరాజు సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన కొడుకును ధోని ఏం చేయాలనుకుంటున్నాడని ప్రశ్నించాడు. ఆ సమయంలో ఒక బూతుమాటను కూడా ధోనిని ఉద్దేశించి యోగరాజ్ వాడారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు సహజమని కానీ ఇప్పుడు మాత్రం ఆ మార్పులు అసహజంగా ఉన్నాయని మండిపడ్డారు. బౌలింగ్ విషయంలోనూ కావాలనే యూవీని ధోని దూరంగా ఉంచుతున్నాడని ఆరోపించారు. 2011 వరల్డ్ కప్‌లో యూవీ 15 వికెట్లు తీసిన విషయం ధోనికి గుర్తు లేదా అని ప్రశ్నించారు. రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై తిరిగి జట్టులోకి తన కుమారుడు వచ్చాడని చెప్పారు. రెండేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండి తిరిగి జట్టులోకి ధోని రాగలడా అని ప్రశ్నించారు. యూవీ అలా తిరిగి రావడం ఒక అద్భుతం అన్నారు. యూవీ అంటే నచ్చకపోతే ఆ విషయాన్ని ధోని నేరుగా సెలెక్టర్లకే చెప్పాలని సూచించారు యోగరాజ్ సింగ్. ప్రస్తుత పరిణామాలపై బాధపడవద్దని తన కుమారుడికి చెప్పినట్టు యోగరాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
యోగరాజ్‌సింగ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ చేత బౌలింగ్ చేయించాడు ధోని. బ్యాంటింగ్‌కు కూడా ముందే పంపాడు. అయితే గ్రౌండ్‌లోని విషయాలపై యువరాజ్ సింగ్ తండ్రి ఈ తరహాలో స్పందించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
Click on Image to Read: