మనుషులే కుక్కల్ని కరుస్తున్నారు!
కుక్క విశ్వాసంగానే ఉంటుంది. అందులో సందేహం లేదు. కానీ మనిషి విశ్వాసంగా ఉంటాడని మాత్రం గ్యారంటీ ఇవ్వలేము. కుక్కలు అనారోగ్యానికి గురయి, పిచ్చివి అయితేనే మనుషులను కరుస్తాయి. లేకపోతే అవి మనుషులకు హాని చేయవు. కానీ మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేము. ఈ సంఘటనలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. మనుషులు, కుక్కలను అన్యాయంగా అత్యంత పాశవికంగా హత్యలు చేసిన సంఘటనలు ఈ మధ్యకాలంలో కొన్ని వెలుగుచూశాయి. ఢిల్లీలోని మెట్రోస్టేషన్‌లో ఓ వ్యక్తి కుక్కపై దాడిచేసి […]
కుక్క విశ్వాసంగానే ఉంటుంది. అందులో సందేహం లేదు. కానీ మనిషి విశ్వాసంగా ఉంటాడని మాత్రం గ్యారంటీ ఇవ్వలేము. కుక్కలు అనారోగ్యానికి గురయి, పిచ్చివి అయితేనే మనుషులను కరుస్తాయి. లేకపోతే అవి మనుషులకు హాని చేయవు. కానీ మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేము. ఈ సంఘటనలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
మనుషులు, కుక్కలను అన్యాయంగా అత్యంత పాశవికంగా హత్యలు చేసిన సంఘటనలు ఈ మధ్యకాలంలో కొన్ని వెలుగుచూశాయి. ఢిల్లీలోని మెట్రోస్టేషన్‌లో ఓ వ్యక్తి కుక్కపై దాడిచేసి దాన్ని చంపడం అక్కడ ఉన్న సిసిటివి ఫుటేజిలో కనిపించింది. బెంగళూరులో ఒక గృహిణికి ఎందుకు అంత కోపం వచ్చిందో కానీ ఏకంగా ఎనిమిది కుక్కపిల్లలను బండరాళ్లతో మోది చంపేసింది. ఆగ్రాలో మరో వ్యక్తి అప్పుడే పుట్టిన ఐదు కుక్క పిల్లలు, దాని తల్లిపై యాసిడ్ పోశాడు. సాధారణంగా అప్పుడే ప్రసవించిన కుక్క ఏదైనా తన పిల్లల దగ్గరకు ఎవరైనా వస్తారేమో అని జాగ్రత్తగా ఉంటుంది. ఆ కుక్కకూడా అలా అరవడంతో ఆ వ్యక్తి అంతపని చేశాడు. ఇవన్నీ ఈ నెలలో జరిగినవే. ఢిల్లీలో జంతు సంరక్షణ కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఫ్రెండికోస్ అందించిన వివరాలు ఇవి. ఈ సంస్థ వద్దకు రోజూ కుక్కల మీద దాడులు జరిగిన కేసులు (చూసినవారు ఫిర్యాదు చేస్తే) కనీసం ఐదారు వస్తుంటాయి. మనుషుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న కుక్కల్లో చాలావరకు యజమానుల నుండి తప్పిపోయి తిరుగుతున్నవే అయివుంటున్నాయట. ఇలాంటి కుక్కలు తమను చేరదీసిన వారిని తేలిగ్గా నమ్ముతాయని ఈ సంస్థకు చెందిన గీతా శేషమణి అంటున్నారు.
బెంగలూరులో ఎనిమిది కుక్కపిల్లలను చంపిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు కానీ ఆమె బెయిల్‌మీద వెంటనే బయటకు వచ్చేసింది.
నిన్నకాకమొన్నబిజెపి ఎమ్మెల్యె గణేష్ జోషి, పోలీస్ గుర్రం శక్తిమాన్‌ని చితగ్గొట్టి దాని కాలు పోయేలా చేసిన సంఘటన చూశాం. ఇలాంటి నేరా లకు యాభై నుండి వంద రూపాయల జరిమానా లాంటి నామమాత్రపు శిక్షలు ఉండటం పట్ల జంతు సంరక్షకులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ దేశాల్లో ఈ చట్టాలు కఠినంగా ఉన్నాయి. అమెరికాలో అయితే మనుషుల హత్యతో సమానంగా కుక్కల హత్యలను పరిగణించేలా చట్టాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో జంతు హింసకు పాల్పడితే ఐదేళ్ల వరకు జైలుశిక్ష, 50వేల డాలర్ల వరకు జరిమానా విధించేలా చట్టాలు ఉన్నాయి. మనదేశంలో శిక్షలు ఇంత నామమాత్రంగా ఉండటం వల్లనే జంతుహింస ఎక్కువగా ఉందని జంతు సంరక్షకులు అంటున్నారు. ఢిల్లీలో ఉన్న పీపుల్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న హెల్ప్‌లైన్‌కి ప్రతిరోజు జంతు హింసకు సంబంధించి 200 ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. దీని తీవ్రత ఎంతగా ఉందో.
Click on Image to Read: