ఏపీ అసెంబ్లీలో ఈ దృశ్యం సాధ్యమా?
ఏపీ అసెంబ్లీకి, తెలంగాణ అసెంబ్లీకి కొన్ని విషయాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీలోనూ పార్టీల మధ్య కోపతాపాలు ఉంటున్నా అవి ఒక మోతాదు వరకే ఉంటున్నాయి. పరిస్థితి చేయిదాటినప్పుడు ఏదో ఒక పక్షం బెట్టువీడుతుండడం తెలంగాణ అసెంబ్లీలో కనిపిస్తోంది. సంస్కారం లేని వాళ్లు సభను నడుపుతున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యలు మూడు రోజుల క్రితం టీ అసెంబ్లీలో కలకలం రేపాయి. అక్కడ కూడా రోజా తరహాలో […]
ఏపీ అసెంబ్లీకి, తెలంగాణ అసెంబ్లీకి కొన్ని విషయాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీలోనూ పార్టీల మధ్య కోపతాపాలు ఉంటున్నా అవి ఒక మోతాదు వరకే ఉంటున్నాయి. పరిస్థితి చేయిదాటినప్పుడు ఏదో ఒక పక్షం బెట్టువీడుతుండడం తెలంగాణ అసెంబ్లీలో కనిపిస్తోంది. సంస్కారం లేని వాళ్లు సభను నడుపుతున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యలు మూడు రోజుల క్రితం టీ అసెంబ్లీలో కలకలం రేపాయి. అక్కడ కూడా రోజా తరహాలో అరుణపై వేటు వేస్తారా అన్న రేంజ్‌లో వివాదం తలెత్తింది. కానీ చివరకు డీకే అరుణపై చర్యలకు హరీష్‌రావు ప్రతిపాదించేందుకు సిద్ధమవగా… హుందాగా పద్మాదేవేందర్ రెడ్డే స్పందించారు. వదిలేయండి ఎలాంటి చర్యలు వద్దు… ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని ప్రకటించి అందరి మన్ననలు పొందారు. అదే ఏపీ అసెంబ్లీలో జరిగి ఉంటే కనీసం ఓ ఆరు నెలల పాటు సభనుండి బయటకు గెంటేసేవారు.
తాజాగా తెలంగాణ అసెంబ్లీలో మరో మంచిపరిణామం జరిగింది. శనివారం వడదెబ్బకారణంగా స్పీకర్ మధుసూదనాచారి సభకు రాలేదు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి మధ్యాహ్నం వరకు సభను నిర్వహించారు. ఆమె భోజనం చేసేందుకు వెళ్లిన సమయంలో స్పీకర్ చైర్‌లో ఎవరు కూర్చోవాలన్న ఇబ్బంది ఎదురైంది. అయితే హరీష్‌రావు నేరుగా విపక్షానికి చెందిన గీతారెడ్డి దగ్గరకు వెళ్లి పరిస్థితిని వివరించారు. కాసేపు చైర్‌లో కూర్చోవాలని కోరారు. అందుకు ఆమె కూడా అంగీకరించారు. ఇది ఆశ్చర్యకరమైన అంశం కాకపోయినా అధికార, ప్రతిపక్షం మధ్య ఒక విధంగా సానుకూల వాతావరణం, సభ జరుగుతున్న తీరుపై ప్రజల్లో గౌరవం పెరిగేలా చేస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇలా విపక్షానికి చెందిన సభ్యులను స్పీకర్ చైర్‌లో ఏపీ అసెంబ్లీలో చూడడం సాధ్యం కాదేమో! ఎందుకంటే ఏపీ అసెంబ్లీలో ప్రతి నిమిషమూ అధికార, విపక్షం మధ్య యుద్ధసన్నివేశంలాగానే ఉంటోంది.
Click on Image to Read: