Telugu Global
NEWS

అసెంబ్లీని కుదిపేసిన సెంట్రల్‌యూనివర్శిటీ వివాదం

హైదరాబాద్‌ సెంట్రల్‌యూనివర్శిటీలో గురువారం జరిగిన ఘటనలు ఈరోజు శాసనసభను కుదిపేశాయి. శాసనసభ మూడుసార్లు వాయిదా పడింది.  ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు, కేసీఆర్‌కు మధ్య ఈ విషయంలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. టీఆర్ఎస్‌ పార్టీ బీజేపీకి తొత్తుగా మారిందని అక్బరుద్దీన్‌ వ్యాఖ్యానించారు. వైస్‌చాన్స్‌లర్‌ అప్పారావును ఎందుకు అరెస్టు చేయలేదని అక్బరుద్దీన్‌ నిలదీశారు. ఆయన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిమీద సభలో చర్చిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. హెచ్‌సీయూలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, విద్యార్ధి చనిపోవడం బాధాకరమని […]

అసెంబ్లీని కుదిపేసిన సెంట్రల్‌యూనివర్శిటీ వివాదం
X

హైదరాబాద్‌ సెంట్రల్‌యూనివర్శిటీలో గురువారం జరిగిన ఘటనలు ఈరోజు శాసనసభను కుదిపేశాయి. శాసనసభ మూడుసార్లు వాయిదా పడింది. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు, కేసీఆర్‌కు మధ్య ఈ విషయంలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. టీఆర్ఎస్‌ పార్టీ బీజేపీకి తొత్తుగా మారిందని అక్బరుద్దీన్‌ వ్యాఖ్యానించారు. వైస్‌చాన్స్‌లర్‌ అప్పారావును ఎందుకు అరెస్టు చేయలేదని అక్బరుద్దీన్‌ నిలదీశారు. ఆయన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిమీద సభలో చర్చిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. హెచ్‌సీయూలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, విద్యార్ధి చనిపోవడం బాధాకరమని కేసీఆర్‌ అన్నారు.

అయితే హెచ్‌సీయూ సంఘటనలపై ఇప్పుడే చర్చ జరగాలని విపక్షాలు గట్టిగా పట్టుపట్టాయి. ప్రతిపక్షాల నినాదాల మధ్య సభలో గందరగోళం నెలకొంది. అక్బరుద్దీన్‌ పలుమార్లు స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్ళారు. హెచ్ సీయూలో ఈ దురదృష్ట సంఘటనలన్నింటికి కారకుడు వైస్ చాన్స్ లర్ అప్పారావేనని, అతని వల్లే యూనివర్శిటీలో వాతావరణం చెడిపోయిందని, అతన్ని వెనక్కి పిలవమని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేద్దామని అక్బరుద్దీన్ కోరారు. విద్యార్ధులను పోలీసులు దారుణంగా హింసించారని, అరెస్టు చేసిన విద్యార్ధులను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తూ వ్యానుల్లో కొట్టారని, పోలీస్ స్టేషన్ లోనూ విద్యార్ధులను కొట్టారని, చివరకు అంబులెన్స్ లోనూ విద్యార్ధిని కొట్టారని పోలీసుల దమన కాండపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు. ఈ సందర్భంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి.

సభను వాయిదా వేసిన ఉప సభాపతి సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు, సభ సజావుగా జరిగేందుకు అన్ని పక్షాల నేతలతో పద్మా దేవేందర్‌ రెడ్డి చర్చలు జరిపారు.

హెచ్‌సీయూ సంఘటనలను రాజకీయం చేయవద్దని ఎమ్మెల్యే లక్ష్మణ్‌ కోరారు. అరెస్ట్‌ అయిన హెచ్‌సీయూ విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశాడు.

ఇది ఇలాగ వుండగా పీడియస్‌యూ విద్యార్ధులు హెచ్‌సీయూలోకి వెళ్లడానికి ప్రయత్నించగా గేటువద్ద సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పీడియస్‌యూ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. పోలీసులు వాళ్లని అరెస్టు చేశారు. హెచ్‌సీయూలో మెస్‌ మూసివేత, నీళ్లు కరెంటు కట్‌ చేయడం, విద్యార్ధులపై జరిగిన లాఠీ చార్జ్‌ మొదలైన విషయాలకు స్పందించిన హ్యూమన్‌రైట్స్‌ కమీషన్‌ హెచ్‌సియూ రిజిస్టార్‌ను పిలిపించి, విచారించింది.

Click on Image to Read:

traffic-police

chiru-chandrababu

kotla

mla-vishnu

ashok-gajapathi-raju

jagan-koneru

Somireddy-Chandramohan-Redd

sunny

anitha

roja 143

radhakrishna

lokesh-ganta-1

bjp-leaders

ys-jagan

ysrcp

jagan

roja-ramoji

First Published:  26 March 2016 7:30 AM IST
Next Story