ఊపిరి... వర్మకు నచ్చింది!
కమర్షియల్ సినిమాలకు ఇక కాలం చెల్లిపోనుందా….ఇది నిజంగా జరిగితే సంతోషించాల్సిన విషయమే. ఊపిరి సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ రామ్‌గోపాల్ వర్మ వెలిబుచ్చిన అభిప్రాయం ఇది. ట్విట్టర్లో ఈ సినిమాని పొగిడేసిన రామ్ గోపాల్ వర్మ, బాహుబలి, శ్రీమంతుడు, భలెభలె మగాడివోయ్, నాన్నకు ప్రేమతో, క్షణం, ఊపిరి…ఈ సినిమాలన్నీ చూస్తుంటే, మసాలా సినిమాలకు రోజులు తీరిపోయి కొత్త శకం మొదలైనట్టే అనిపిస్తోందని అన్నారు. తెలుగు, తమిళం రెండురంగాలకు చెందిన పెద్ద నటులతో తీసిన ఈ సినిమా, రెండు భాషల్లోనూ […]
కమర్షియల్ సినిమాలకు ఇక కాలం చెల్లిపోనుందా….ఇది నిజంగా జరిగితే సంతోషించాల్సిన విషయమే. ఊపిరి సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ రామ్‌గోపాల్ వర్మ వెలిబుచ్చిన అభిప్రాయం ఇది. ట్విట్టర్లో ఈ సినిమాని పొగిడేసిన రామ్ గోపాల్ వర్మ, బాహుబలి, శ్రీమంతుడు, భలెభలె మగాడివోయ్, నాన్నకు ప్రేమతో, క్షణం, ఊపిరి…ఈ సినిమాలన్నీ చూస్తుంటే, మసాలా సినిమాలకు రోజులు తీరిపోయి కొత్త శకం మొదలైనట్టే అనిపిస్తోందని అన్నారు. తెలుగు, తమిళం రెండురంగాలకు చెందిన పెద్ద నటులతో తీసిన ఈ సినిమా, రెండు భాషల్లోనూ హిటయ్యి, ఇలా కాంబినేషన్ లతో సినిమాలు తీసి, మార్కెట్‌ని డబల్ చేసుకోవచ్చని నిరూపించిందని వర్మ అన్నారు. ఫక్తు మసాలా సినిమాలు తీసే వారు ప్రేక్షకులను తెలివిలేని ఇడియట్స్ అనుకుంటారని, కానీ ఊపిరి లాంటి సినిమాలను తీసేవారు మాత్రం ప్రేక్షకుల తెలివితేటలను గౌరవిస్తారని రామ్‌గోపాల్ వర్మ విశ్లేషించారు.