రూ. 2 లక్షలు ఇస్తే లేపేస్తున్నారు… నాకు భద్రత కావాలి
ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ శాంతిభద్రతల అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రస్తావించారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రౌడీలు, కిరాయి హంతకుల సంఖ్య భారీగా పెరిగిపోయిందన్నారు. రెండు లక్షలు ఇస్తే చాలు ఎవడినైనా లేపేస్తున్నారని చెప్పారు. ఇలాంటి ప్రాంతంలో తాను పర్యటించాల్సి వస్తోందని కాబట్టి అదనపు భద్రత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరానన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2014లో గురుపౌర్ణమి రోజు టీడీపీ […]
ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ శాంతిభద్రతల అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రస్తావించారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రౌడీలు, కిరాయి హంతకుల సంఖ్య భారీగా పెరిగిపోయిందన్నారు. రెండు లక్షలు ఇస్తే చాలు ఎవడినైనా లేపేస్తున్నారని చెప్పారు. ఇలాంటి ప్రాంతంలో తాను పర్యటించాల్సి వస్తోందని కాబట్టి అదనపు భద్రత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరానన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
2014లో గురుపౌర్ణమి రోజు టీడీపీ స్థానిక నేత ఆహ్వానం మేరకు ఫంక్షన్ కు వెళ్లానని .. ఆదే రోజు సదరు నేత వచ్చి తనకు ఒక విషయం చెప్పారన్నారు. అతడితో పాటు తనకు కూడా ప్రాణహాని ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారన్నారు. కానీ తాను పట్టించుకోలేదని… అంతలోనే అదే రోజు సాయంత్రం అత్యంత దారుణంగా సదరు టీడీపీ నేత హత్యకు గురయ్యారన్నారు. ఈ హత్య చేయించింది కూడా మరో టీడీపీ నేతేనని ఆరోపించారు. సిరికి శీను అనే వ్యక్తి హంతకులకు డబ్బులు ఇచ్చినట్టు తేలినా ఇప్పటి వరకు కనీసం అతడిని విచారించలేదని విష్ణుకుమార్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. హతుడి కుటుంబసభ్యులు 20 నెలలుగా మంత్రుల చుట్టూ తిరుగుతున్నా విచారణ మాత్రం జరిపించడం లేదన్నారు. వెంటనే ఈ హత్యపై సీఐడీ విచారణ జరిపించాలని కోరారు. అదే సమయంలో ఏడాదిన్నర కాలంలో అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేసిన వారిపైనా విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.
Click on Image to Read: