కాజల్ పై అందరికీ ఎన్నో అనుమానాలు...
కాజల్ ఇంటర్వ్యూలు గుర్తున్నాయా… ఆ ముద్దుగుమ్మ తెలుగులో మాట్లాడగా మీరెప్పుడైనా విన్నారా…. ఇందులో ఆలోచించడానికేం లేదు. కాజల్ అస్సలు తెలుగులో మాట్లాడదు. తెలుగు నేర్చుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. ఎప్పుడు ఇంగ్లిష్ లేదంటే హిందీలో మాట్లాడుతుంది. అలాంటి కాజల్… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పిందనే వార్త సునామీలా వ్యాపించిపోయింది. కాజల్ తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుందో వినాలనే ఉత్సుకత ప్రతి ప్రేక్షకుడిలో ఉంది. కాకపోతే సేమ్ టైం… అదే కొంపముంచుతుందేమో అనే భయం […]
BY admin26 March 2016 8:52 AM IST
X
admin Updated On: 26 March 2016 12:09 PM IST
కాజల్ ఇంటర్వ్యూలు గుర్తున్నాయా… ఆ ముద్దుగుమ్మ తెలుగులో మాట్లాడగా మీరెప్పుడైనా విన్నారా…. ఇందులో ఆలోచించడానికేం లేదు. కాజల్ అస్సలు తెలుగులో మాట్లాడదు. తెలుగు నేర్చుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. ఎప్పుడు ఇంగ్లిష్ లేదంటే హిందీలో మాట్లాడుతుంది. అలాంటి కాజల్… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పిందనే వార్త సునామీలా వ్యాపించిపోయింది. కాజల్ తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుందో వినాలనే ఉత్సుకత ప్రతి ప్రేక్షకుడిలో ఉంది. కాకపోతే సేమ్ టైం… అదే కొంపముంచుతుందేమో అనే భయం సినిమా యూనిట్ లో కనిపిస్తోంది. అవును… కాజల్ తో డబ్బింగ్ చెప్పించాలనే నిర్ణయం ఎవరిదో తెలీదు కానీ… సినిమాలో ఆమె పాత్రకు సొంత డబ్బింగ్ సూట్ అవ్వలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ తో వచ్చే సన్నివేశాల దగ్గర… సన్నివేశాల ఫీల్ కు కాజల్ వాయిస్ సరిపోలేదని… యూనిట్ సభ్యులే చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటి వరకు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ బయటకు రాలేదు. ఆడియో ఎబోవ్ యావరేజ్ గా ఉందనే టాక్ కు తోడు… ఇప్పుడు కాజల్ వాయిస్ పై కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ కు చెక్ చెప్పాలంటే… కాజల్ వాయిస్ కూడా వినిపించేలా మరో ట్రయిలర్ సెట్ చేస్తే సరిపోతుంది.
Next Story