జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ...గూగుల్‌కి అలా అర్థమైంది!
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పేరు తెచ్చిపెట్టిన అంశం… అక్కడి విద్యార్థులు, అఫ్జల్ గురు ఉరికి, భారత్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే ఆరోపణలు, ఆ తదనంతర పరిస్థితులే. అంతేకాదు, అది కార్చిచ్చులా రగిలి, దేశభక్తి, దేశద్రోహం, జాతి వ్యతిరేకత, రాజద్రోహం… తదితర భావాలన్నీ విస్తృతంగా తెరమీదకు వచ్చాయి. ఈ అంశాలను గురించి ఎక్కువమంది ఎక్కువసార్లు మాట్లాడారు. అయితే ఈ అంశాలన్నింటినీ లేవనెత్తింది మాత్రం జెఎన్‌యులో ఉత్పన్నమయిన పరిస్థితులే. అందుకే ఈ పదాలను గురించి […]
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పేరు తెచ్చిపెట్టిన అంశం… అక్కడి విద్యార్థులు, అఫ్జల్ గురు ఉరికి, భారత్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే ఆరోపణలు, ఆ తదనంతర పరిస్థితులే. అంతేకాదు, అది కార్చిచ్చులా రగిలి, దేశభక్తి, దేశద్రోహం, జాతి వ్యతిరేకత, రాజద్రోహం… తదితర భావాలన్నీ విస్తృతంగా తెరమీదకు వచ్చాయి. ఈ అంశాలను గురించి ఎక్కువమంది ఎక్కువసార్లు మాట్లాడారు. అయితే ఈ అంశాలన్నింటినీ లేవనెత్తింది మాత్రం జెఎన్‌యులో ఉత్పన్నమయిన పరిస్థితులే. అందుకే ఈ పదాలను గురించి గూగుల్‌లో వెతుకుతుంటే, వీటికి చిత్రాలుగా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ, అక్కడి విద్యార్థుల ఫొటోలు గూగుల్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. యాంటీ నేషనల్ (జాతి వ్యతిరేకత) అని టైప్ చేయగానే గూగుల్ చిత్రాల్లో జెఎన్‌యు ప్రత్యక్ష్యం అవడంపై యూనివర్శిటీ విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నామని గూగుల్ ప్రతినిధి తెలిపారు. సరే…ఏది రాజద్రోహమో, ఏది జాతివ్యతిరేకతో, ఏది దేశభక్తో దేశంలోని పౌరులకే అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్న క్రమంలో, ఇక ప్రాణం లేని టెక్నాలజీకి ఏం అర్థమవుతుంది!