ఇక రైళ్లలో పిల్లలకు అరటిక్కెట్లు లేవు
ఇప్పటివరకు రిజర్వుడ్ కంపార్ట్‌మెంట్లలో పిల్లలతో ప్రయాణించాల్సివస్తే 5-12 సంవత్సరాల మధ్య పిల్లలకు అరటిక్కెట్లు ఉండేవి. ఈ వయస్సు పిల్లలకు బెర్త్‌లు కావాలన్నా అరటిక్కెట్టు తీసుకొని బెర్త్ కేటాయించేవారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి పిల్లలకు బెర్త్ సౌకర్యాన్ని తొలగించింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇక నుంచి 5-12 సంవత్సరాల మధ్య పిల్లలకు బెర్త్ కావాలంటే పూర్తి ఛార్జీ చెల్లించాల్సిందే. లేదా అరటిక్కెట్టు తీసుకుంటే పెద్దవాళ్లకు కేటాయించిన బెర్త్‌లో సర్దుకుపోవాల్సిందే. వేరే బెర్త్ ఉండదు. ఇలా చేయడంవల్ల రైల్వేస్‌కు […]
ఇప్పటివరకు రిజర్వుడ్ కంపార్ట్‌మెంట్లలో పిల్లలతో ప్రయాణించాల్సివస్తే 5-12 సంవత్సరాల మధ్య పిల్లలకు అరటిక్కెట్లు ఉండేవి. ఈ వయస్సు పిల్లలకు బెర్త్‌లు కావాలన్నా అరటిక్కెట్టు తీసుకొని బెర్త్ కేటాయించేవారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి పిల్లలకు బెర్త్ సౌకర్యాన్ని తొలగించింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం.
ఇక నుంచి 5-12 సంవత్సరాల మధ్య పిల్లలకు బెర్త్ కావాలంటే పూర్తి ఛార్జీ చెల్లించాల్సిందే. లేదా అరటిక్కెట్టు తీసుకుంటే పెద్దవాళ్లకు కేటాయించిన బెర్త్‌లో సర్దుకుపోవాల్సిందే. వేరే బెర్త్ ఉండదు.
ఇలా చేయడంవల్ల రైల్వేస్‌కు ఏడాదికి 525 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం లభిస్తుందట. ఇప్పటివరకు ఏడాదికి 2కోట్ల సీట్లు అరటిక్కెట్టు కింద పిల్లలకు లభించేవి. ఇక నుంచి అవి ఫుల్ టిక్కెట్ సీట్లుగా అందరికి లభిస్తాయి.