16 ఏళ్ల తర్వాత కలిసిన హిట్ జోడి
అర్జున్, మనీషా కొయిరాలా… ఈ జోడీ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చే సినిమా ఒకే ఒక్కడు. ఆ సినిమాతో సూపర్ హిట్ జోడీగా వీళ్లిద్దరూ పేరుతెచ్చుకున్నారు. అయితే ఆ మూవీ తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి సినిమా చేయలేకపోయారు. అర్జున్ క్యారెక్టర్ రోల్స్ వైపు మొగ్గుచూపడం…మనీషా కొయిరాలా క్యాన్సర్ తో బాధపడుతూ సినిమాలకు దూరమైపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ అర్జున్ తన పంథాలో ఓ యాక్షన్ సినిమా చేశాడు. అటు మనీషా కూడా క్యాన్సర్ […]
BY admin25 March 2016 11:41 PM GMT
X
admin Updated On: 26 March 2016 12:50 AM GMT
అర్జున్, మనీషా కొయిరాలా… ఈ జోడీ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చే సినిమా ఒకే ఒక్కడు. ఆ సినిమాతో సూపర్ హిట్ జోడీగా వీళ్లిద్దరూ పేరుతెచ్చుకున్నారు. అయితే ఆ మూవీ తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి సినిమా చేయలేకపోయారు. అర్జున్ క్యారెక్టర్ రోల్స్ వైపు మొగ్గుచూపడం…మనీషా కొయిరాలా క్యాన్సర్ తో బాధపడుతూ సినిమాలకు దూరమైపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ అర్జున్ తన పంథాలో ఓ యాక్షన్ సినిమా చేశాడు. అటు మనీషా కూడా క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుంది. సో… వీళ్లిద్దరి కాంబోలో 16 ఏళ్ల విరామం తర్వాత ఓ సినిమా తెరకెక్కింది.
రమేష్ అనే తమిళ దర్శకుడు తెరకెక్కించిన ఆ సినిమా పేరు ఒరు మెళ్లియ కోడు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. త్వరలోనే తమిళనాట విడుదలవుతోంది. ఆ వెంటనే తెలుగులోకి కూడా డబ్ చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి 16 ఏళ్ల గ్యాప్ తర్వాత అర్జున్-మనీషా కొయిరాలా కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే సందేహాలే వద్దు. ఎందుకంటే… తాజా చిత్రంలో ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉండవు. అర్జున్-మనీషా ఇద్దరూ యాక్షన్ మూడ్ లోనే కనిపిస్తారు.
Next Story