బలపనూరులో గెలుపెవరిది?
పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్న టీడీపీ… పులివెందులలో జగన్‌కు మాత్రం కళ్లెం వేస్తామంటోంది. అది కూడా వైఎస్ సొంతూరు నుంచే జగన్‌కు చెక్ పెట్టే ఆటకు శ్రీకారం చుడుతామంటోంది. ఇటీవల ఎత్తులు వేసి చేతులు కాల్చుకుంటున్న లోకేషే ఈ ఆపరేషన్‌ను కూడా పర్యవేక్షిస్తున్నారట. ఆపరేషన్‌లో పాత్రదారులు కడప జిల్లా టీడీపీ నేతలతో పాటు, ఇటీవల పార్టీ మారిన ఆదినారాయణ రెడ్డి పాత్రదారులుగా రంగంలోకి దింపుతోంది టీడీపీ. […]
పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్న టీడీపీ… పులివెందులలో జగన్‌కు మాత్రం కళ్లెం వేస్తామంటోంది. అది కూడా వైఎస్ సొంతూరు నుంచే జగన్‌కు చెక్ పెట్టే ఆటకు శ్రీకారం చుడుతామంటోంది. ఇటీవల ఎత్తులు వేసి చేతులు కాల్చుకుంటున్న లోకేషే ఈ ఆపరేషన్‌ను కూడా పర్యవేక్షిస్తున్నారట.
ఆపరేషన్‌లో పాత్రదారులు కడప జిల్లా టీడీపీ నేతలతో పాటు, ఇటీవల పార్టీ మారిన ఆదినారాయణ రెడ్డి పాత్రదారులుగా రంగంలోకి దింపుతోంది టీడీపీ. వైఎస్ సొంతూరు సింహాద్రిపురం మండలం బలపనూరు. ఇటీవల ఈ గ్రామ సర్పంచ్ సరస్వతమ్మ అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో జగన్‌ను పులివెందుల నియోజకవర్గంలో ఓడించడం దాదాపు అసాధ్యమన్న అంచనాకు వచ్చిన టీడీపీ నేతలు… వైసీపీని మానసికంగా దెబ్బతీసేందుకు బలపనూరు బరిని వాడుకోవాలనుకుంటోంది.
రాష్ట్రంలో అధికారం చేతితో ఉంది కాబట్టి ఒక గ్రామ పరిధిలోని ఎన్నికలను ప్రభావితం చేయడం పెద్ద కష్టమేమి కాదన్న భావనతో టీడీపీ నేతలు అన్నారట. కాబట్టి త్వరలో జరిగే బలపనూరు సర్పంచ్ ఎన్నికల్లో ఆర్థిక అంగబలం సాయంతో వైసీపీని ఓడించి… దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రచారం చేస్తే వైసీపీ శ్రేణుల్లో అలజడి రేపవచ్చని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. సొంతూరులోనే పార్టీని గెలిపించుకోలేకపోయిన జగన్ ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడంటూ ప్రచారం చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
బలపనూరు ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి సేవలను బాగా వాడుకోవాలని టీడీపీ భావిస్తోందట. అయితే కడప రాజకీయాల గురించి తెలిసిన వారు మాత్రం బలపనూరులో టీడీపీ గెలవాలంటే ఓ పది వేల మంది పోలీసులను మోహరించి పోలింగ్ బూతుల వద్ద జనాన్ని రాకుండా చేసి … పోలింగ్ 70 శాతం దాటిస్తే టీడీపీ గెలిచినట్టేనని సెటైర్లు వేస్తున్నారు. బలపనూరులో ఎందుకు గానీ… ఆదినారాయణరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ గుర్తుపై పోటీ చేస్తే అప్పుడు తెలిసిపోతుంది కదా ఏ పార్టీ సినిమా ఎంతో అని వైసీపీ అభిమానులు అంటున్నారు.
Click on Image to Read: