Telugu Global
Cinema & Entertainment

రాజ‌మౌళి నమ్మ‌కాన్ని బ్రేక్ చేసిన డైరెక్ట‌ర్ వంశీ..!

కొన్ని చిత్రాలు చేసేట‌ప్పుడు ద‌ర్శ‌కుల గ‌త చిత్రాల్ని చెక్ చేయ‌డం ప‌రిపాటి. అలాగే వంశీ పైడిపల్లి నాగార్జున తో ఊపిరి అనే చిత్రం చేస్తున్న‌ప్పుడు ఆయ‌న స్నేహితులు..స‌న్నిహితులు వంశీ ఈ చిత్రాన్ని హ్యండిల్ చేయ‌లేడేమో అనుకున్నారు. ఎందుకంటే ఆయ‌న చేసిన మూడు చిత్రాలు మున్నా, బృందావ‌నం, ఎవ‌డు .. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్సే.దీంతో సెన్సిటివ్ ఎమోష‌న్స్ వున్న ఈ ఊపిరి చిత్రాన్నివంశీ పైడిప‌ల్లి హ్యాండిల్ చేయగలడా అని అందరు భావించారు. చాల మంది మాదిరే స్టార్ డైరెక్ట‌ర్ […]

రాజ‌మౌళి నమ్మ‌కాన్ని బ్రేక్ చేసిన డైరెక్ట‌ర్ వంశీ..!
X

కొన్ని చిత్రాలు చేసేట‌ప్పుడు ద‌ర్శ‌కుల గ‌త చిత్రాల్ని చెక్ చేయ‌డం ప‌రిపాటి. అలాగే వంశీ పైడిపల్లి నాగార్జున తో ఊపిరి అనే చిత్రం చేస్తున్న‌ప్పుడు ఆయ‌న స్నేహితులు..స‌న్నిహితులు వంశీ ఈ చిత్రాన్ని హ్యండిల్ చేయ‌లేడేమో అనుకున్నారు. ఎందుకంటే ఆయ‌న చేసిన మూడు చిత్రాలు మున్నా, బృందావ‌నం, ఎవ‌డు .. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్సే.దీంతో సెన్సిటివ్ ఎమోష‌న్స్ వున్న ఈ ఊపిరి చిత్రాన్నివంశీ పైడిప‌ల్లి హ్యాండిల్ చేయగలడా అని అందరు భావించారు. చాల మంది మాదిరే స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కూడా వంశీ ఊపిరి చిత్రం ఇంత బాగా హ్యాండిల్ చేయగలడని అనుకోలేద‌ట‌. అయితే ఈరోజు సినిమా చూసిన తరువాత‌.. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఈ సినిమాను ఇంగ్లీషు లో అల్రేడి చూసిన రాజ‌మౌళి తెలుగులో అదే ప్రేర‌ణ‌గా వ‌స్తుందంటే వంశీ ఈ స‌బ్జెక్ట్ ను స‌రిగా న్యాయం చేయలేడేమో అని అనుకున్నార‌ట‌. అయితే త‌న అంచ‌నాను వంశీ త‌ప్పు అని నిరిపించినందుకు ధ‌న్య‌వాద‌లు చెప్పి.. చిత్ర యూనిట్ అంద‌రికి శుభాకాంక్ష‌లు తెలిపారు. నాగార్జున అయితే పాత్ బ్రేక‌ర్ అని ప్ర‌శంసించారు. మొత్తం మీద రాజ‌మౌళి అంచనాను ద‌ర్శ‌కుడు వంశీ త‌ల్ల‌కిందులు చేసేశాడ‌న్న‌మాట‌.

First Published:  25 March 2016 9:34 AM IST
Next Story