చిరంజీవికి మరోసారి సర్జరీ
ఓవైపు 150వ సినిమా కోసం రెడీ అవుతున్న చిరంజీవికి సంబంధించిన కొన్ని వదంతులు అభిమానుల్ని నిరాశకు గురిచేస్తున్నాయి. త్వరలోనే చిరంజీవి మరో శస్త్రచికిత్స చేసుకుంటారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి భుజానికి ఓ ఆపరేషన్ జరిగింది. శ్రీజ వివాహా ఏర్పాట్లు ప్రారంభమైన కొత్తలో చేతికి కట్టుతోనే ఫొటోల్లో కనిపించారు చిరు. ఇప్పుడు శ్రీజ వివాహం తర్వాత కూడా మరోసారి ముంబయి వెళ్లి…. భుజానికే మరో ఆపరేషన్ చేయించుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీజ వివాహం తర్వాత వెంటనే […]
BY admin25 March 2016 4:44 AM IST
X
admin Updated On: 25 March 2016 8:03 AM IST
ఓవైపు 150వ సినిమా కోసం రెడీ అవుతున్న చిరంజీవికి సంబంధించిన కొన్ని వదంతులు అభిమానుల్ని నిరాశకు గురిచేస్తున్నాయి. త్వరలోనే చిరంజీవి మరో శస్త్రచికిత్స చేసుకుంటారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి భుజానికి ఓ ఆపరేషన్ జరిగింది. శ్రీజ వివాహా ఏర్పాట్లు ప్రారంభమైన కొత్తలో చేతికి కట్టుతోనే ఫొటోల్లో కనిపించారు చిరు. ఇప్పుడు శ్రీజ వివాహం తర్వాత కూడా మరోసారి ముంబయి వెళ్లి…. భుజానికే మరో ఆపరేషన్ చేయించుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీజ వివాహం తర్వాత వెంటనే 150వ సినిమా ప్రారంభిస్తారనే అభిమానుల ఆశలకు గండిపడింది. అయితే చిరంజీవికి చిన్నపాటి ఆపరేషన్ మాత్రమే జరుగుతుందని… కేవలం పది రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. ఏప్రిల్ చివరి నాటికి, భుజం గాయంతో కోలుకోవడం… కొత్త సినిమా ప్రారంభించడం లాంటి కీలకమైన పనులన్నీ పూర్తయిపోతాయని భావిస్తున్నారు.
Next Story