యాభై మంది ప్రపంచ ప్రముఖుల లిస్టులో... కేజ్రీవాల్!
ఫార్చ్యూన్ మేగజైన్ ప్రకటించిన యాభైమంది గొప్ప నాయకుల లిస్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చోటు సంపాదించారు. భారత్ నుండి ఎంపికైన ఏకైక నాయకుడు ఆయనే కావడం విశేషం. అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్ ఈ వరుసలో ప్రథమస్థానంలో ఉన్నారు. వ్యాపారం, ప్రభుత్వాలు, మానవశాస్త్రం, కళా రంగాలనుండి, ప్రపంచాన్ని మార్చడంలో తమవంతు కృషి చేసిన 50మంది నాయకత్వ లక్షణాలున్న ప్రముఖులను ఎంపిక చేసి ప్రకటించారు. ఈ లిస్టులో కేజ్రీవాల్ 42వస్థానంలో ఉన్నారు. న్యూయార్క్ నుండి ప్రచురితమౌతున్న మల్టీ […]
ఫార్చ్యూన్ మేగజైన్ ప్రకటించిన యాభైమంది గొప్ప నాయకుల లిస్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చోటు సంపాదించారు. భారత్ నుండి ఎంపికైన ఏకైక నాయకుడు ఆయనే కావడం విశేషం. అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్ ఈ వరుసలో ప్రథమస్థానంలో ఉన్నారు. వ్యాపారం, ప్రభుత్వాలు, మానవశాస్త్రం, కళా రంగాలనుండి, ప్రపంచాన్ని మార్చడంలో తమవంతు కృషి చేసిన 50మంది నాయకత్వ లక్షణాలున్న ప్రముఖులను ఎంపిక చేసి ప్రకటించారు. ఈ లిస్టులో కేజ్రీవాల్ 42వస్థానంలో ఉన్నారు.
న్యూయార్క్ నుండి ప్రచురితమౌతున్న మల్టీ నేషనల్ బిజినెస్ మేగజైన్ ఫార్చ్యూన్ ఈ రకమైన ఎంపికలు నిర్వహించడం వరుసగా ఇది మూడోసారి. దక్షిణ కరోలినాకు చెందిన భారతసంతతికి చెందిన అమెరికన్ గవర్నర్ నిక్కీ హేలే 17వ స్థానంలో ఉండగా, మరో భారతసంతతి వ్యక్తి రేషం సాజని 20వ స్థానంలో ఉన్నారు. ఇక భారత్ నుండి ఎంపికైన ఏకైక వ్యక్తి కేజ్రీవాలే. కేజ్రీవాల్ వచ్చాక ఢిల్లీ పాలనా పద్ధతులను, ప్రజల జీవితాల్లో, జీవనాన్ని ప్రభావితం చేసే అంశాలలో కేజ్రీవాల్ తెచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఎంపిక చేసినట్టు ఫార్చ్యూన్ మేగజైన్ తెలిపింది.
ఫార్చ్యూన్ లిస్టులో జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్ రెండో స్థానంలో, మయన్మార్ ప్రజాస్వామ్యవాది ఆంగ్‌సాన్ సూకీ మూడో స్థానంలో ఉన్నారు.