టీడీపీలో చేరిన కడప జిల్లా సీనియర్ నేత
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్‌పైనా పడింది. ఖాళీగా ఉన్న నేతలకు టీడీపీ ఆశ్రయం కల్పిస్తోంది. తాజాగా కడప జిల్లాకు చెందిన సాయిప్రతాప్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ మరణానంతరం యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగాను సాయిప్రతాప్ పనిచేశారు. వైఎస్‌కు మొదటి నుంచి సాయిప్రతాప్ మంచి మిత్రుడు. అయితే ఆయన మరణం తర్వాత కూడా కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి […]
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్‌పైనా పడింది. ఖాళీగా ఉన్న నేతలకు టీడీపీ ఆశ్రయం కల్పిస్తోంది. తాజాగా కడప జిల్లాకు చెందిన సాయిప్రతాప్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ మరణానంతరం యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగాను సాయిప్రతాప్ పనిచేశారు. వైఎస్‌కు మొదటి నుంచి సాయిప్రతాప్ మంచి మిత్రుడు. అయితే ఆయన మరణం తర్వాత కూడా కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మిథున్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం నేపథ్యంలో కాపులు పార్టీకి దూరమవుతున్నారని భావించిన టీడీపీ అధినాయకత్వం అదే సామాజికవర్గానికి చెందిన సాయిప్రతాప్‌ను పార్టీలోకి ఆకర్షించింది. సాయిప్రతాప్ సాయంతో రాయలసీమ ప్రాంతంలో కాపు ఉద్యమం తీవ్రతను తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. సాయిప్రతాప్ కడప జిల్లాలో ఆరుసార్లు గెలిచారంటే కారణం అందుకు వైఎస్సేనని కూడా చెబుతుంటారు.
Click on Image to Read: