దేవుడా... కాపీ కొడుతూ పట్టుబడిన గుంటూరు మాజీ ఎమ్మెల్యే
నీతులు చెప్పే నేతలు దిగజారిపోయారు. ఉన్నత చదువులు చదివినట్టుగా బిల్డప్ ఇచ్చేందుకు అడ్డదారులు తొక్కారు. పరీక్షల్లో పాస్ అయ్యేందుకు మాస్ కాపీయింగ్ చేస్తూ అడ్డంగా బుక్కపోయారు. గుంటూరు ఏసీ కాలేజీలో లా పరీక్షలు జరుగుతున్నాయి. అయితే స్టూడెంట్స్ అంతా గుంపుగా మారి మాస్ కాపీయింగ్ మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న స్క్వాడ్ సెంటర్‌పై దాడి చేసింది. దీంతో మూకుమ్మడిగా అందరూ పట్టుబడ్డారు. అంతవరకు బాగానే ఉంది. పట్టుబడిన వారి వివరాలు తెలిశాక అధికారులకు దిమ్మతిరిగి కాసేపు మైండ్ పనిచేయలేదు. […]
నీతులు చెప్పే నేతలు దిగజారిపోయారు. ఉన్నత చదువులు చదివినట్టుగా బిల్డప్ ఇచ్చేందుకు అడ్డదారులు తొక్కారు. పరీక్షల్లో పాస్ అయ్యేందుకు మాస్ కాపీయింగ్ చేస్తూ అడ్డంగా బుక్కపోయారు. గుంటూరు ఏసీ కాలేజీలో లా పరీక్షలు జరుగుతున్నాయి. అయితే స్టూడెంట్స్ అంతా గుంపుగా మారి మాస్ కాపీయింగ్ మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న స్క్వాడ్ సెంటర్‌పై దాడి చేసింది. దీంతో మూకుమ్మడిగా అందరూ పట్టుబడ్డారు. అంతవరకు బాగానే ఉంది.
పట్టుబడిన వారి వివరాలు తెలిశాక అధికారులకు దిమ్మతిరిగి కాసేపు మైండ్ పనిచేయలేదు. పట్టుబడిన వారిని ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే పట్టుబడిన వారు సాధారణ విద్యార్థులు కాదు. ఘనత వహించిన నేతలు. పట్టుబడిన వారిలో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మస్తాన్ వలి కూడా ఉన్నారు. బీజేపీ నాయకుడు భాస్కర్‌రావు కూడా ఉన్నారు. మరోకాంగ్రెస్ నేత ఎస్‌కే జిలానీ కూడా ఉన్నారు. వీరంతా ఎంచక్కా ఒకచోట కూర్చుని చూచిరాతలు రాసుకుంటుండగా స్య్వాడ్ అటాక్ చేసింది.
Click on Image to Read: