Telugu Global
Cinema & Entertainment

ఊపిరి చిత్రం  పై బంగ‌ర్రాజు   గ‌ట్టి న‌మ్మ‌కం..!

న‌టుడు అయిన  ప్ర‌తి ఒక్క‌రికి కొన్ని సంద‌ర్భాల్లో గ‌ట్టి న‌మ్మ‌కం  క‌లిగిన సంద‌ర్భాలు కొన్ని అయిన వుంటాయి. నాగార్జున సినిమాకు సంబంధించి ఒక‌టి గ‌ట్టిగా  విశ్వ‌సిస్తే ఫెయిల్ అయిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌నే చెప్పాలి.    ఆయ‌న కెరీర్ లో   ఘ‌న విజ‌యం సాధించిన చిత్రాల‌న్ని అలా జ‌రిగిన‌వే. తాజాగా వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఊపిరి చిత్రం విష‌యంలో  నాగార్జున చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. ప్రేక్ష‌కుల‌కు  భిన్న‌మైన అభిప్రాయాలున్న‌ప్ప‌టికి  నాగార్జున మాత్రం  గ‌ట్టి న‌మ్మ‌కం క‌లిగి వున్నారు.  […]

ఊపిరి చిత్రం  పై బంగ‌ర్రాజు   గ‌ట్టి న‌మ్మ‌కం..!
X

న‌టుడు అయిన ప్ర‌తి ఒక్క‌రికి కొన్ని సంద‌ర్భాల్లో గ‌ట్టి న‌మ్మ‌కం క‌లిగిన సంద‌ర్భాలు కొన్ని అయిన వుంటాయి. నాగార్జున సినిమాకు సంబంధించి ఒక‌టి గ‌ట్టిగా విశ్వ‌సిస్తే ఫెయిల్ అయిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌నే చెప్పాలి. ఆయ‌న కెరీర్ లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రాల‌న్ని అలా జ‌రిగిన‌వే.

తాజాగా వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఊపిరి చిత్రం విష‌యంలో నాగార్జున చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. ప్రేక్ష‌కుల‌కు భిన్న‌మైన అభిప్రాయాలున్న‌ప్ప‌టికి నాగార్జున మాత్రం గ‌ట్టి న‌మ్మ‌కం క‌లిగి వున్నారు. త‌న రోల్ నాలుగు చ‌క్రాల కుర్చికే ప‌రిమితం అయిన‌ప్ప‌టికి.. అది జీవం లేనే క్యారెక్ట‌ర్ కాద‌ని.. ఎన్నో భావేద్వేగాల‌కు నిల‌యంగా వుంటుంద‌ని.. అలాగే క్యారెక్ట‌ర్స్ లో ఎన్నో భావోద్వేగాలు పండించే అవ‌కాశం వుంద‌ని తెలిపారు. శుక్ర‌వారం తెలుగు , త‌మిళ భాష‌ల్లో ఊపిరి చిత్రం భారీగా రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. పీవిపి నిర్మాణ సంస్థ 60 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం పై బిజినెస్ విష‌యంలో ఎంత క‌లెక్ట్ చేస్తుందో అనే ఒక ఆస‌క్తి ట్రేడ్ ఎక్స్ ప‌ర్ట్స్ లో ఉంది మ‌రి.

First Published:  24 March 2016 11:17 AM IST
Next Story