భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా షారుక్ ఖాన్!
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన భారత్ పాక్‌ల క్రికెట్ మ్యాచ్‌లో అమితాబ్ బచ్చన్ అదనపు ఆకర్షణగా నిలిచి, జాతీయ గీతం ఆలంపించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ రోజు బెంగలూరులో చిన్నస్వామి స్టేడియంలో భారత్ బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో షారుక్‌ఖాన్ సందడి చేయనున్నారు. ఈడెన్ గార్డెన్స్ విజయానందాన్ని ఆస్వాదించలేకపోయానే అని బాధపడుతున్న షారుక్‌ఖాన్ ఈ రోజు మ్యాచ్‌ని ఎంజాయ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. అంతేకాదు, ఆయన కపిల్‌దేవ్, పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్‌లతో […]
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన భారత్ పాక్‌ల క్రికెట్ మ్యాచ్‌లో అమితాబ్ బచ్చన్ అదనపు ఆకర్షణగా నిలిచి, జాతీయ గీతం ఆలంపించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ రోజు బెంగలూరులో చిన్నస్వామి స్టేడియంలో భారత్ బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో షారుక్‌ఖాన్ సందడి చేయనున్నారు. ఈడెన్ గార్డెన్స్ విజయానందాన్ని ఆస్వాదించలేకపోయానే అని బాధపడుతున్న షారుక్‌ఖాన్ ఈ రోజు మ్యాచ్‌ని ఎంజాయ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. అంతేకాదు, ఆయన కపిల్‌దేవ్, పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్‌లతో కలిసి కామెంటేటర్ పాత్రని పోషించనున్నారు. ఆట మొదలైన మొదటి అరగంటలో షారుక్, మైదానంలో ఆటకు తన గొంతుని అనుసంధానిస్తారు. విరాట్ కోహ్లీ ఈడెన్ గార్డెన్స్‌లో పాక్‌పై వీరలెవల్‌లో విరుచుకుపడిన ఆటని తాను చూడలేకపోయినందుకు షారుక్ చాలా బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా పిల్మ్ అవార్డుల కార్యక్రమం కోసం దుబాయిలో ఉన్నారు. కోల్‌కతా మ్యాచ్‌కు అమితాబ్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, తెరమీద ధోనీ పాత్రని పోషించబోతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హాజరైన సంగతి తెలిసిందే. క్రికెట్ ని బాగా ఇష్టపడే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓనరు షారుక్‌కి, భారత్ పాక్‌ల క్రికెట్ మ్యాచ్ చూడలేకపోవడం బాధేమరి. ఆ కొరతని ఈ రోజు ఆయన తీర్చుకోబోతున్నారు.