సాక్షి వ్యవహారం- ఏపీ పోలీసులకు పీసీఐ నోటీసులు
ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూకుంభకోణాలపై వరుస కథనాలు ప్రచురించిన సాక్షి మీడియాపై ఏపీ పోలీసులు చర్యలకు దిగడం చర్చనీయాంశమైంది. కథనాలురాసిన జర్నలిస్టులపైనా చర్యలు తీసుకుంటామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టుగానే పోలీసులు చర్యలకు దిగారు. గుంటూరు పోలీసులు ఏకంగా సాక్షి సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కథనాలకు ఆధారాలు చూపాలని పట్టుపట్టారు. రిపోర్టనే కాకుండా డెస్క్ జర్నలిస్టులను కూడా పిలిపించి విచారించారు. ఇలా జర్నలిస్టులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ […]
ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూకుంభకోణాలపై వరుస కథనాలు ప్రచురించిన సాక్షి మీడియాపై ఏపీ పోలీసులు చర్యలకు దిగడం చర్చనీయాంశమైంది. కథనాలురాసిన జర్నలిస్టులపైనా చర్యలు తీసుకుంటామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టుగానే పోలీసులు చర్యలకు దిగారు.
గుంటూరు పోలీసులు ఏకంగా సాక్షి సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కథనాలకు ఆధారాలు చూపాలని పట్టుపట్టారు. రిపోర్టనే కాకుండా డెస్క్ జర్నలిస్టులను కూడా పిలిపించి విచారించారు. ఇలా జర్నలిస్టులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం తీవ్రంగా స్పందించింది. పత్రిక జర్నలిస్టులను పోలీస్ స్టేషన్కు పిలిపించడాన్ని పీసీఐ తప్పుబట్టింది. ఆధారాలు బయటపెట్టాలనడం పత్రికా స్వేచ్ఛకు భంగకరమని వ్యాఖ్యానించింది.
ఏపీ పోలీసుల తీరు ఆందోళనకరంగా ఉందని అభిప్రాయపడింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న పీసీఐ… ఏపీ ప్రభుత్వానికి, డీజీపీ, గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టులు రాసిన కథనాలకు సోర్స్ చెప్పాల్సిందిగా ఒత్తిడి చేసే అధికారం ఎవరికీ లేదని పీసీఐ నిబంధనల్లోనూ ఉందని సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో వ్యవహరించిన తీరుగానే ఇప్పుడు ఏపీ పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
Click on Image to Read: