ఊపిరి తీయడానికి టైం 2 వారాలే
నాగార్జున-కార్తి హీరోలుగా నటించిన ఊపిరి సినిమాను ఈనెల 25న విడుదల చేస్తున్నారు. ఆ టైమ్ కు పెద్ద సినిమాల సందడి పెద్దగా లేదు. కాబట్టి ఆ టైమ్ లో తమ మల్టీస్టారర్ విడుదల చేస్తే కచ్చితంగా కాసుల వర్షం కురుస్తుందని నాగ్ ఎక్స్ పెక్ట్ చేశాడు. మన్మధుడి ప్లానింగ్ బాగానే ఉంది.కానీ ప్రేక్షకుల మూడ్ మాత్రం మారిపోయింది. టాలీవుడ్ లో ఇప్పుడు దాదాపు ప్రతి పది మందిలో ఆరుగురు సినీప్రేమికులు సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాల […]
BY admin23 March 2016 4:30 AM IST
X
admin Updated On: 23 March 2016 5:10 AM IST
నాగార్జున-కార్తి హీరోలుగా నటించిన ఊపిరి సినిమాను ఈనెల 25న విడుదల చేస్తున్నారు. ఆ టైమ్ కు పెద్ద సినిమాల సందడి పెద్దగా లేదు. కాబట్టి ఆ టైమ్ లో తమ మల్టీస్టారర్ విడుదల చేస్తే కచ్చితంగా కాసుల వర్షం కురుస్తుందని నాగ్ ఎక్స్ పెక్ట్ చేశాడు. మన్మధుడి ప్లానింగ్ బాగానే ఉంది.కానీ ప్రేక్షకుల మూడ్ మాత్రం మారిపోయింది. టాలీవుడ్ లో ఇప్పుడు దాదాపు ప్రతి పది మందిలో ఆరుగురు సినీప్రేమికులు సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాల గురించే చర్చించుకుంటున్నారు. ఆడియో ఫంక్షన్ కు సర్దార్ గబ్బర్ సింగ్ తో అఫీషియల్ గా కౌంట్ డౌన్ స్టార్టయింది. ఇక మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా ఆడియో కోసం కూడా ఎప్పట్నుంచో ఫ్యాన్స్ వెయిటింగ్. ఈ రెండు సినిమాల గురించే ఆలోచిస్తూ…. వెంటనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఊపిరిని పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. మరోవైపు సినిమాపై ఉత్సుకత పెంచేలా ప్రమోషన్ చేయడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సినిమాలో స్టఫ్ ఉంటే ఇవన్నీ తేలిపోతాయి. అల్టిమేట్ గా ఊపిరి హిట్ అయి తీరుకుంది. ప్రస్తుతం యూనిట్ అదే నమ్మకంతో ఉంది.
Click on image to Read
Next Story