సాక్షికి టీడీపీ మీడియాకు తేడా అదే!
మంగళవారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జగన్… చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ హయాంలోనే ఎక్కువ నిధులు మంజూరు చేశారని లెక్కలతో వివరించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ‘’ప్రాజెక్టులు కట్టిన వారి కంటే గేట్లు ఎత్తే లష్కర్లే గొప్పవాళ్లు’’ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ ఏదో సామెత తరహాలో అలా చెప్పారు. కానీ ఈ వ్యాఖ్య వివాదాస్పదం అవుతుందనిపించింది. ఎందుకంటే […]
మంగళవారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జగన్… చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ హయాంలోనే ఎక్కువ నిధులు మంజూరు చేశారని లెక్కలతో వివరించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ‘’ప్రాజెక్టులు కట్టిన వారి కంటే గేట్లు ఎత్తే లష్కర్లే గొప్పవాళ్లు’’ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
జగన్ ఏదో సామెత తరహాలో అలా చెప్పారు. కానీ ఈ వ్యాఖ్య వివాదాస్పదం అవుతుందనిపించింది. ఎందుకంటే ప్రాజెక్టులు కట్టిన వారైనా, గేట్లు ఎత్తే లష్కర్లు అయినా అంతా సమానమే. ఎవరి స్థాయిలో వారు పనిచేస్తారు. ఇలా నేతలు సామెతలు చెప్పడం కామనే. కానీ జగన్ వ్యాఖ్యలను టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేయలేదు.. కానీ జగన్ సొంత టీవీ చానల్ మాత్రం బాగా ప్రచారం చేసింది. హెడ్‌లైన్లలో కూడా ”ప్రాజెక్టులు కట్టిన వారు గొప్పా, లష్కర్లు గొప్పా” అని జగన్ అన్నట్టుగా హెడ్‌లైన్స్ చదివారు. గంటల తరబడి స్క్రోలింగ్ నడిపారు. ఊహించినట్టుగానే మంత్రి దేవినేని ఉమ.. జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
లష్కర్లను కించపరిచేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఏదో ఫ్లోలో జగన్ అలా అని ఉండవచ్చు. కానీ సాక్షి టీవీలో పెద్దవాళ్లు ఏం చేస్తున్నారన్నది వైసీపీ వర్గీయుల ప్రశ్న. జగన్ అన్న వ్యాఖ్యలను అలా హైలైట్ చేస్తే ఏమవుతుందో కూడా సాక్షి ఉన్నత సిబ్బంది అంచనా వేయలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు జగన్‌ను సాక్షి చానల్, పేపర్ ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టాయని గుర్తు చేసుకుంటున్నారు. సాక్షిలోనే కాదు… వైసీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న వెబ్‌సైట్‌లోనూ లష్కర్లపై జగన్ చేసిన వ్యాఖ్యలనే హెడ్‌లైన్‌గా పెట్టారు. జగన్ డైలాగ్ వినడానికి బాగుంది కదాని పదేపదే ప్రసారం చేశారే గానీ దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది మాత్రం పెద్దలు అంచనా వేయలేకపోయారన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు గొర్రెలకాపరులను, మొన్నీ మధ్య దళితులను కించపరుస్తూ నేరుగా వ్యాఖ్యలు చేశారని.. కానీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఎక్కడా ఆ మాటలను ప్రసారం చేయలేదని గుర్తు చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియాకు ఉన్నన్ని తెలివి తేటలు తమ సాక్షిలో వారికి లేకపోవడం దురదృష్టమని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Click on Image to Read: