దేవాన్ష్ ను టార్గెట్ చేసిన నెటిజన్లు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్ సోమవారం తొలి పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మనవడికి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఫోటో కూడా పోస్టు చేశారు. అయితే ఇక్కడో ఓ విచిత్రమైన విషయాన్ని నెటిజన్లు గమనించారు. అంతే ప్రపంచానికి పాఠాలు చెప్పిన చంద్రబాబుకు ట్విట్టర్ రూల్స్ తెలియవా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే లోకేష్ కు కూడా ట్వీట్టర్ రూల్స్ తెలియవా అని ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్లో […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్ సోమవారం తొలి పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మనవడికి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఫోటో కూడా పోస్టు చేశారు. అయితే ఇక్కడో ఓ విచిత్రమైన విషయాన్ని నెటిజన్లు గమనించారు. అంతే ప్రపంచానికి పాఠాలు చెప్పిన చంద్రబాబుకు ట్విట్టర్ రూల్స్ తెలియవా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే లోకేష్ కు కూడా ట్వీట్టర్ రూల్స్ తెలియవా అని ప్రశ్నిస్తున్నారు.
ట్విట్టర్‌లో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం 13 ఏళ్లు ఉండాలి. కానీ దేవాన్ష్‌కు ఇప్పుడు ఒక ఏడాది మాత్రమే. కానీ దేవాన్ష్ పేరుతో ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ అకౌంట్‌కే చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలను ట్వీట్ చేశారు. చంద్రబాబు చేసిన ఈ పనిని నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసి మరీ ఫేస్ బుక్‌లో పెట్టారు. కొందరు ఏకంగా ట్విట్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంకొందరు ఈ విషయంపై ట్విట్టర్‌కు ఎలా ఫిర్యాదు చేయాలో వివరిస్తూ లింక్‌లు కూడా ఇచ్చారు. అసలు అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో వయసును తెలియజేయాలి. మరీ దేవాన్ష్ అకౌంట్‌ను ఏం చెప్పి ఓపెన్ చేశారో?. అసలు ఈ అకౌంట్‌ను ఎవరు ఓపెన్ చేశారో?. చంద్రబాబు కూడా ట్విట్టర్ నిబంధనలను గమనించినట్టు లేరు. ఒక వేళ నిజంగా పొరపాటు జరిగి ఉంటే ట్విట్టర్ దేవాన్ష్ అకౌంట్‌ను రద్దు చేస్తుంది. పాన్ కార్డుకు ట్విట్టర్ అకౌంట్ కు తేడా తెలియని వాళ్లు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.
Click on Image to Read: