రోజాకు మరో చాన్స్, కొడాలిపై చర్యలు వాయిదా
ప్రివిలేజ్ కమిటీ నివేదికపై ఏపీ అసెంబ్లీ సుధీర్ఘంగా చర్చించింది. కమిటీ సిఫార్సులను సభ ఆమోదించింది. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు రోజాకు మరో అవకాశం ఇస్తున్నట్టు అసెంబ్లీ ప్రకటించింది. అంతవరకు సస్పెన్షన్ అమలులోనే ఉంటుందని స్పీకర్ చెప్పారు. కొడాలి నానిపై చర్యలు తీసుకునే బాధ్యతను సభకు కమిటీ అప్పగించగా… ఆయనపై చర్యలను వాయిదా వేస్తున్నట్టు సభ ప్రకటించింది. క్షమాపణ చెప్పినందుకు గాను జ్యోతుల నెహ్రు, చెవిరెడ్డి, శ్రీధర్ రెడ్డిను వదిలేస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. ప్రివిలేజ్ […]

ప్రివిలేజ్ కమిటీ నివేదికపై ఏపీ అసెంబ్లీ సుధీర్ఘంగా చర్చించింది. కమిటీ సిఫార్సులను సభ ఆమోదించింది. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు రోజాకు మరో అవకాశం ఇస్తున్నట్టు అసెంబ్లీ ప్రకటించింది. అంతవరకు సస్పెన్షన్ అమలులోనే ఉంటుందని స్పీకర్ చెప్పారు. కొడాలి నానిపై చర్యలు తీసుకునే బాధ్యతను సభకు కమిటీ అప్పగించగా… ఆయనపై చర్యలను వాయిదా వేస్తున్నట్టు సభ ప్రకటించింది. క్షమాపణ చెప్పినందుకు గాను జ్యోతుల నెహ్రు, చెవిరెడ్డి, శ్రీధర్ రెడ్డిను వదిలేస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. ప్రివిలేజ్ కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా ప్రతిపక్షం కూడా సభలో ఉండి ఉంటే బాగుండేదని స్పీకర్ కోడెల అభిప్రాయపడ్డారు. చట్ట సభల్లో తప్పులు చేయని వారుండరన్నారు. ముఖ్యమంత్రులు కూడా తప్పులు చేశారన్నారు. అయితే వాటిని సరిదిద్దుకుంటే సమస్య ఉండదన్నారు.
Click on Image to Read: