పవన్ ప్రెస్ మీట్ వెనక రీజనేంటి....?
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదలకు కొన్ని గంటల ముందు హఠాత్తుగా పవన్ మీడియా ముందుకొచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా ప్రెస్ మీట్ పెట్టాడు. తన సినిమా ఆడియోకు పర్మిషన్ ఇవ్వలేదన్నాడు. ఆ వెంటనే… కేటీఆర్, హరీష్ చొరవతో పర్మిషన్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. కేటీఆర్, హరీష్ కు ధన్యవాదాలు చెప్పాడు. ఇదంతా పవన్ ఎందుకు చేసినట్టు. ఆడియో ఫంక్షన్ కు అనుమతి నిరాకరించడం…. తర్వాత వేదికలు మార్చడం…. తెరవెనక లాబీయింగ్ చేసి అనుమతులు తెచ్చుకోవడం…. ఇవన్నీ ఈమధ్య […]
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదలకు కొన్ని గంటల ముందు హఠాత్తుగా పవన్ మీడియా ముందుకొచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా ప్రెస్ మీట్ పెట్టాడు. తన సినిమా ఆడియోకు పర్మిషన్ ఇవ్వలేదన్నాడు. ఆ వెంటనే… కేటీఆర్, హరీష్ చొరవతో పర్మిషన్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. కేటీఆర్, హరీష్ కు ధన్యవాదాలు చెప్పాడు. ఇదంతా పవన్ ఎందుకు చేసినట్టు. ఆడియో ఫంక్షన్ కు అనుమతి నిరాకరించడం…. తర్వాత వేదికలు మార్చడం…. తెరవెనక లాబీయింగ్ చేసి అనుమతులు తెచ్చుకోవడం…. ఇవన్నీ ఈమధ్య కాలంలో బడా సినిమాలకు సర్వసాధారణం. దీనికోసం ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. పోనీ… సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ కోసం ప్రెస్ మీట్ పెట్టాడా అనుకుంటే…. అది ప్రస్తుతం అసందర్భం. ఆడియో ఫంక్షన్ తర్వాతే ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టుకుంటారు. అలాగని తన ప్రెస్ మీట్ తో ఏమైనా సంచలన ప్రకటనలు చేశాడా అంటే అదీ లేదు. కనీసం రాజకీయాల గురించి కూడా మాట్లాడలేదు. మొత్తంగా చూసుకుంటే…. పవన్ ప్రసంగం సారాంశంలో ఒకేఒక్క అంశం కొత్తగా కనిపించింది. దాని కోసమే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా అనిపించింది. తన స్పీచ్ లో కేటీఆర్, హరీష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు పవన్. కేవలం దాని కోసమే ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపించింది. ఎంపీ కవిత తనపై పదేపదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో…. తమ మధ్య ఆల్ ఈజ్ వెల్ అనే భావం కలిగించేందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టు అర్థమౌతోంది.