రజనీ సినిమా రిలీడ్ డేట్స్ ఫిక్స్
ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు రజనీకాంత్. రంజిత్ అనే కొత్త దర్శకుడితో కలిసి కబాలి అనే సినిమా చేస్తూనే… శంకర్ దర్శకత్వంలో రోబో2.0ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈ రెండు సినిమాల్లో కబాలి సినిమా రిలీజ్ డేట్స్ ను పక్కా చేసిన రజనీకాంత్… రోబో 2.0 విడుదలపై కూడా స్పష్టత ఇచ్చాడు. తమిళనాడు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని, కబాలి సినిమా విడుదలను వాయిదా వేసిన రజనీకాంత్…. తాజాగా ఈ సినిమాను మే 27న విడుదల చేస్తున్నట్టు […]
BY sarvi20 March 2016 4:47 PM IST
X
sarvi Updated On: 20 March 2016 4:51 PM IST
ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు రజనీకాంత్. రంజిత్ అనే కొత్త దర్శకుడితో కలిసి కబాలి అనే సినిమా చేస్తూనే… శంకర్ దర్శకత్వంలో రోబో2.0ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈ రెండు సినిమాల్లో కబాలి సినిమా రిలీజ్ డేట్స్ ను పక్కా చేసిన రజనీకాంత్… రోబో 2.0 విడుదలపై కూడా స్పష్టత ఇచ్చాడు. తమిళనాడు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని, కబాలి సినిమా విడుదలను వాయిదా వేసిన రజనీకాంత్…. తాజాగా ఈ సినిమాను మే 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. నిజానికి వచ్చే నెల 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తేదీకి కబాలి ట్రయిలర్ ను లాంఛ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మరోవైపు రోబో 2.0కు సంబంధించి కూడా ఓ తేదీని అటుఇటుగా చెప్పుకొచ్చాడు రజనీకాంత్. కుదిరితే వచ్చే ఏడాది చివర్లో…. అంటే 2017 డిసెంబర్ లో తన పుట్టినరోజు కానుకగా రోబో 2.0 విడుదలయ్యే అవకాశాలున్నాయంటున్నాడు. అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే ప్రశ్నకు మాత్రం సూపర్ స్టార్ చేతులెత్తేశాడు.
Next Story