మళ్లీ బజారున పడ్డ ఆంధ్రా మాల్యా పరువు
మాజీ ఎంపీ, బీజేపీ నేత కావూరి సాంబశివరావు పరువు మరోసారి రోడ్డు మీదకు వచ్చింది. బ్యాంకుల నుంచి వందల కోట్లు అప్పు చేసి చెల్లించకుండా తిరుగుతున్న కావూరిపై బ్యాంకులు పోరుబాట పట్టాయి. నోటీసులతో పనికాదని నిర్ధారణకు వచ్చిన బ్యాంకులు … సిబ్బందిని రంగంలోకి దింపాయి. కావూరి ఇంటి ముందు ధర్నాకు దింపాయి. తమ బ్యాంకుకు అప్పుగా ఉన్న రూ. 160 కోట్లు వెంటనే చెల్లించాలని కోరుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది కావూరికి చెందిన హైదరాబాద్‌లోని నివాసం […]
మాజీ ఎంపీ, బీజేపీ నేత కావూరి సాంబశివరావు పరువు మరోసారి రోడ్డు మీదకు వచ్చింది. బ్యాంకుల నుంచి వందల కోట్లు అప్పు చేసి చెల్లించకుండా తిరుగుతున్న కావూరిపై బ్యాంకులు పోరుబాట పట్టాయి. నోటీసులతో పనికాదని నిర్ధారణకు వచ్చిన బ్యాంకులు … సిబ్బందిని రంగంలోకి దింపాయి. కావూరి ఇంటి ముందు ధర్నాకు దింపాయి. తమ బ్యాంకుకు అప్పుగా ఉన్న రూ. 160 కోట్లు వెంటనే చెల్లించాలని కోరుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది కావూరికి చెందిన హైదరాబాద్‌లోని నివాసం ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు .
”బ్యాంకు సొమ్ము అంటే ప్రజల సొమ్ము దాన్ని తిరిగి చెల్లించండి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ”బ్యాంకులను ముంచవద్దు… ప్రజల పొట్టకొట్టవద్దూ” అని సూచించారు. కావూరి ఇంటి ముందు బ్యాంకు సిబ్బంది ఆందోళనను స్థానికులు అందరూ ఆసక్తిగా గమనించారు. బంజారాహిల్స్‌లోని సీసీఆర్ ఇన్‌ఫ్రా టెక్ సంస్థ ఎదుట కూడా బ్యాంకు సిబ్బంది ధర్నా నిర్వహించారు.
గత డిసెంబర్‌లోనూ కావూరికి చెందిన ప్రొగ్రెసివ్ కన్‌స్ర్టక్షన్ కంపెనీ ముందు ఏకంగా 18 బ్యాంకులు కలిసి ధర్నా చేశాయి. వివిధ బ్యాంకుల నుంచి కావూరి కంపెనీ వెయ్యి కోట్ల అప్పు తీసుకుంది. ఒక్క ఆంధ్రా బ్యాంకు సుల్తాన్ బజార్ బ్రాంచ్ నుంచే 200 కోట్లు తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీచేసినా సొమ్ము చెల్లించలేదు.
ఇటీవల కావూరి సాంబశివరావుకు చెందిన ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆస్తుల వేలానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. తమకు చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదంటూ తెలంగాణ వాణిజ్య శాఖ కావూరి కంపెనీకి నోటీసులు జారీ చేసింది. పన్ను బకాయి వసూలు కోసం కంపెనీ ఆస్తులు వేలం వేస్తామని నోటీసులిచ్చింది. దీనిపై ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ హైకోర్టుకు వెళ్లింది. అయినా అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. ఆస్తుల వేలంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వెంటనే మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని సూచించింది అప్పట్లో కోర్టు.
Click on Image to Read: