Telugu Global
CRIME

హ‌వాలా డ‌బ్బుపై ఆశ‌...అభ‌య్ ప్రాణం తీసింది!

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన అభ‌య్ హ‌త్య‌కేసు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్టే ఉంది. అభ‌య్ తండ్రి కోట్ల రూపాయ‌ల హ‌వాలా వ్యాపారం చేస్తున్నాడ‌ని తెలుసుకున్న నిందితులు ఆ డ‌బ్బుకోస‌మే అభ‌య్‌ని కిడ్నాప్, హ‌త్య చేశార‌ని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ‌య్‌ని స్కూట‌ర్‌పై తీసుకువెళ్లిన చిన్న‌సాయిని వైజాగ్‌లోనూ, మ‌రో ఇద్ద‌రిని రాజ‌మండ్రిలోనూ పోలీసులు అరెస్టు చేశారు. శ‌నివారం ఉద‌యానిక‌ల్లా వీరిని హైద‌రాబాద్ తీసుకురానున్నారు. అభయ్‌ను స్కూటీపై తీసుకెళ్లిన చిన్నసాయి గోషామహల్‌లోని హరిఓంకాలనీలో ప్రదీప్‌ […]

హ‌వాలా డ‌బ్బుపై ఆశ‌...అభ‌య్ ప్రాణం తీసింది!
X

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన అభ‌య్ హ‌త్య‌కేసు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్టే ఉంది. అభ‌య్ తండ్రి కోట్ల రూపాయ‌ల హ‌వాలా వ్యాపారం చేస్తున్నాడ‌ని తెలుసుకున్న నిందితులు ఆ డ‌బ్బుకోస‌మే అభ‌య్‌ని కిడ్నాప్, హ‌త్య చేశార‌ని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ‌య్‌ని స్కూట‌ర్‌పై తీసుకువెళ్లిన చిన్న‌సాయిని వైజాగ్‌లోనూ, మ‌రో ఇద్ద‌రిని రాజ‌మండ్రిలోనూ పోలీసులు అరెస్టు చేశారు. శ‌నివారం ఉద‌యానిక‌ల్లా వీరిని హైద‌రాబాద్ తీసుకురానున్నారు.

అభయ్‌ను స్కూటీపై తీసుకెళ్లిన చిన్నసాయి గోషామహల్‌లోని హరిఓంకాలనీలో ప్రదీప్‌ ధారక్‌ అనే ప్లాస్టిక్‌ వ్యాపారి ఇంట్లో పని చేస్తున్నాడని అభయ్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. రాజమండ్రికి చెందిన చిన్నసాయి(21) ఆరు నెలలుగా ప్ర‌దీప్ ఇంట్లో ప‌నిచేస్తున్నాడు. అత‌ను ప‌దిరోజుల క్రిత‌మే సెల‌వుపెట్టాడ‌ని, రాజ‌మండ్రి వెళుతున్న‌ట్టుగా చెప్పాడ‌ని ప్ర‌దీప్ పోలీసుల‌కు తెలియ‌జేశారు. అయితే చిన్న‌సాయి రాజ‌మండ్రికి వెళ్ల కుండా అభ‌య్ కిడ్నాప్‌లో ప్ర‌ధాన‌పాత్ర పోషించాడు.

ప‌దికోట్లు కావాల‌ని అభ‌య్ కుటుంబ స‌భ్యుల‌ను అడిగిన వ్య‌క్తి ఆ ఫోన్‌ని విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్‌లో పారేసి వెళ్ల‌డంతో ఆ ఫోన్లో ఉన్న నెంబ‌ర్ల‌పై నిఘాపెట్టిన పోలీసులు చిన్న‌సాయిని ప‌ట్టుకోగ‌లిగారు. ఆ త‌రువాత అత‌నిచ్చిన స‌మాచారం మేర‌కు మిగిలిన ఇద్ద‌రినీ అరెస్టు చేశారు.

అభ‌య్ కిడ్నాప్‌కు అరునెల‌లుగా ప్ర‌య‌త్నించిన నిందితులు చిన్న‌సాయిని అందుకు వాడుకున్నార‌ని, అత‌డికి డ‌బ్బుని ఎర‌గా చూపార‌ని పోలీసులు భావిస్తున్నారు. హ‌వాలా వ్యాపారంలో అభ‌య్ తండ్రి కోట్లు సంపాదిస్తున్నాడ‌నే స‌మాచారంతో ఆ డ‌బ్బుకోసమే నిందితులు ఈ ఘోరాల‌కు పాల్ప‌డ్డార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. డ‌బ్బుకోసం డిమాండ్ చేసిన గొంతు సాయిది కాద‌ని పోలీసులు చెబుతున్నారు. క‌నీసం ముగ్గురు క‌లిసి హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసు ఉన్న‌తాధికారులు భావిస్తున్నారు.

సాయి, అభ‌య్‌ అత‌ని త‌మ్ముడు, ఇత‌ర చుట్టుప‌క్క‌ల పిల్ల‌ల‌తో క‌లిసి మాట్లాడేవాడ‌ని, వారితో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లేవాడ‌ని అభ‌య్ మేన‌మామ సంతోష్ తెలిపాడు. త‌మ ఇంటికి పండుగ‌లు, వేడుక‌ల‌కు వ‌చ్చేవాడ‌ని అయితే సాయే అభ‌య్‌ని చంపాడ‌ని చెప్ప‌లేమ‌ని ఆయ‌న చెప్పాడు.

అభయ్‌ హత్యకేసులో కొన్ని కీలకాధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని పోలీసు అధికారులు చెబుతున్నారు. సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించాక హంతకులెవరన్నది ప్రాథమికంగా నిర్ధార‌ణ చేశామ‌ని, ముగ్గురు కలసి అభయ్‌ని చంపేశారని భావిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ కేసులో నేర‌స్తులకు శిక్ష‌ప‌డాల‌న్న ల‌క్ష్యంతో పకడ్బందీగా సాక్ష్యాలను సేకరిస్తున్నామ‌ని వారు పేర్కొన్నారు.

First Published:  19 March 2016 4:10 AM IST
Next Story