కృష్ణాష్టమి నుంచి జక్కన్న కోలుకుంటాడా...
సునీల్ ఏది పట్టుకున్నా అది ఫ్లాప్ అయి కూర్చుంటోంది. కొన్నేళ్లుగా ఈ హీరో పరిస్థితి ఏం బాగాలేదు. మరోవైపు హీరో వేషాలు కట్టిపెట్టి… మళ్లీ కమెడియన్ గా మారిపోమని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లు కూడా ఎక్కువైపోయారు. దీనికి తోడు తాజాగా విడుదలైన కృష్ణాష్టమి కూడా కష్టాలు తెచ్చిపెట్టడంతో సునీల్ కెరీర్ అయోమయంలో పడిపోయింది. ఇలాంటి టైమ్ లో సునీల్ ను ఆదుకోవడానికి జక్కన్న సిద్ధమయ్యాడు. అవును… సునీల్ చేస్తున్న కొత్త సినిమా పేరిది. ఈ సినిమా ఫస్ట్ […]
BY sarvi19 March 2016 2:30 AM IST
X
sarvi Updated On: 19 March 2016 4:52 AM IST
సునీల్ ఏది పట్టుకున్నా అది ఫ్లాప్ అయి కూర్చుంటోంది. కొన్నేళ్లుగా ఈ హీరో పరిస్థితి ఏం బాగాలేదు. మరోవైపు హీరో వేషాలు కట్టిపెట్టి… మళ్లీ కమెడియన్ గా మారిపోమని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లు కూడా ఎక్కువైపోయారు. దీనికి తోడు తాజాగా విడుదలైన కృష్ణాష్టమి కూడా కష్టాలు తెచ్చిపెట్టడంతో సునీల్ కెరీర్ అయోమయంలో పడిపోయింది. ఇలాంటి టైమ్ లో సునీల్ ను ఆదుకోవడానికి జక్కన్న సిద్ధమయ్యాడు. అవును… సునీల్ చేస్తున్న కొత్త సినిమా పేరిది. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. కృష్ణాష్టమి థీమ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా… జక్కన్న కూడా రొటీన్ గా ఉంది. ఓ బ్యాక్ ప్యాక్ వేసుకొని సునీల్ నడిచొచ్చే కటౌట్ ఒకటి విడుదల చేశారు. మన్నారా చోప్రా హీరోయిన్ గా ఆకెళ్ల వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జక్కన్న సినిమా అయినా తనను ఆదుకుంటుందేమో అని సునీల్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. సినిమాలో కామెడీ ఫుల్లుగా ఉంటే కచ్చితంగా సునీల్ ఆశలు నెరవేరతాయి. ఈ వేసవిలోనే జక్కన్న థియేటర్లలో సందడి చేయనున్నాడు
Next Story