రేయ్.. పులివెందుల గూండాలా మాట్లాడవద్దు… బీకేర్‌పుల్ " సాక్షి విలేకరిని కొట్టినంత పనిచేసిన గోరంట్ల, బోండా
అసెంబ్లీ అవరణలో మీడియా పాయింట్ వద్ద టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బోండా ఉమా సాక్షి విలేకరితో గొడవ పడ్డారు. మీడియా పాయింట్‌లో సాక్షి విలేకరి టీడీపీ నేతలకు ప్రశ్న వేయడంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు సహనం కోల్పోయారు. సాక్షి విలేకరికి మాట్లాడే హక్కు లేదంటూ ఎదురుదాడి చేశారు. ముందు కూర్చో… నీ కథలు ఇక్కడ కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల గుండాలా మాట్లాడవద్దు అంటూ బోండా ఉమా వార్నింగ్ ఇచ్చారు. వెళ్లి నీ […]
అసెంబ్లీ అవరణలో మీడియా పాయింట్ వద్ద టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బోండా ఉమా సాక్షి విలేకరితో గొడవ పడ్డారు. మీడియా పాయింట్‌లో సాక్షి విలేకరి టీడీపీ నేతలకు ప్రశ్న వేయడంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు సహనం కోల్పోయారు. సాక్షి విలేకరికి మాట్లాడే హక్కు లేదంటూ ఎదురుదాడి చేశారు. ముందు కూర్చో… నీ కథలు ఇక్కడ కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పులివెందుల గుండాలా మాట్లాడవద్దు అంటూ బోండా ఉమా వార్నింగ్ ఇచ్చారు. వెళ్లి నీ లోటస్‌పాండ్‌లో చూసుకో అంటూ రుసరుసలాడారు. పులివెందుల గుండా అని సంబోధించడంపై మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బోండా, బుచ్చయ్య మరింత రెచ్చిపోయారు. ‘’మాతో ఫైట్ చేస్తావా.. ఇష్టముంటే రిపోర్ట్ చేయ్, లేకుండా వదిలేయ్ తమాషాలు వద్దు, నీ హద్దుల్లో ఉండు’’ అంటూ హెచ్చరించారు. ఓ దశలో ఏంట్రా నీది అంటూ బుచ్చయ్య సహనం కోల్పోయారు. వీరికి మద్దతుగా వచ్చిన మరో టీడీపీ నేత ‘’ రేయ్ మర్యాదగా మాట్లాడు, రౌడీ అనుకుంటున్నావా’’ అంటూ సాక్షి విలేకరికి వేలు చూపిస్తూ హెచ్చరించారు. ఈ గొడవ జరుతున్న సమయంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి హవాభావాలు తీవ్రస్థాయిలో అనిపించాయి. వెళ్లి లోటస్‌పాండ్‌లో చూసుకో అంటూ బోండా ఉమా పదేపదే హెచ్చరించారు. watch video….
Click on Image to Read: