Telugu Global
NEWS

చెల్లిని కూర్చోబెట్టి రోజా కోసం పోరాటమా?.. అయ్యప్ప భజనే బెటర్!

రోజాను సభలో అనుమతించాలంటూ వైసీపీ ఆందోళనకు దిగడాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టారు. వైసీపీకి నాయకుడు జగనా లేక రోజానా అన్న విషయం అర్థం కావడం లేదని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎద్దేవా చేశారు.  చెల్లెలు షర్మిలను ఇంట్లో  కూర్చోబెట్టి రోజా కోసం జగన్‌ పోరాటం చేయడం విచిత్రంగా ఉందన్నారు.  వైసీపీ నేతలు అయ్యప్ప భజన చేస్తే పుణ్యమైనా వస్తుందని… రోజా భజన చేస్తే ఏమీ రాదన్నారు రవికుమార్. జగన్‌ అనుభవరాహిత్యంతో సభా సమయం వృధా అవుతోందని […]

చెల్లిని కూర్చోబెట్టి రోజా కోసం పోరాటమా?.. అయ్యప్ప భజనే బెటర్!
X

రోజాను సభలో అనుమతించాలంటూ వైసీపీ ఆందోళనకు దిగడాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టారు. వైసీపీకి నాయకుడు జగనా లేక రోజానా అన్న విషయం అర్థం కావడం లేదని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎద్దేవా చేశారు. చెల్లెలు షర్మిలను ఇంట్లో కూర్చోబెట్టి రోజా కోసం జగన్‌ పోరాటం చేయడం విచిత్రంగా ఉందన్నారు. వైసీపీ నేతలు అయ్యప్ప భజన చేస్తే పుణ్యమైనా వస్తుందని… రోజా భజన చేస్తే ఏమీ రాదన్నారు రవికుమార్.

జగన్‌ అనుభవరాహిత్యంతో సభా సమయం వృధా అవుతోందని బొండా ఉమ విమర్శించారు. ఇప్పటికైనా జగన్ పద్దతి మార్చుకోవాలన్నారు. లేనిపక్షంలో వైసీపీలో ఒక్కరు కూడా మిగలరని అన్నారు. జగన్‌ ఒక అరాచకవాది అని మంత్రి రావెల కిషోర్ బాబు విమర్శించారు. తన రాజకీయం కోసం రోజాను వాడుకుంటున్నారని విమర్శించారు.

రోజాకు ఇప్పుడు విధించిన శిక్ష చాలా తక్కువమని మంత్రి పీతల సుజాత అన్నారు. రోజా వ్యాఖ్యలను ఏ మహిళ కూడా సమర్ధించరని అన్నారు. రోజా వ్యాఖ్యలను ఒక్క మహిళ సమర్థించినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పీతల సుజాత సవాల్ చేశారు.

First Published:  19 March 2016 6:17 AM IST
Next Story