నీరసించి రోడ్డుపైనే పడుకున్న రోజా… క్షణాల్లో సభ వాయిదా
తనను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై రోజా నిరసనకు దిగారు. అసెంబ్లీ బయట గాంధీ విగ్రహానికి ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఉదయం నుంచి ఆమె నిరసనకు దిగారు. అయితే ఎండకు రోజా నీరసించిపోయారు. దీంతో ఫుట్‌పాత్‌పైనే ఆమె సేదతీరారు. ఫుట్‌పాత్‌పై టవల్ పరుచుకుని అక్కడే నిద్రపోయారు. వైఎస్ జగన్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి రోజాను పరామర్శించారు. అనంతరం రోజాను 108 అంబులెన్ లో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు . రోజాను ఎందుకు […]

తనను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై రోజా నిరసనకు దిగారు. అసెంబ్లీ బయట గాంధీ విగ్రహానికి ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఉదయం నుంచి ఆమె నిరసనకు దిగారు. అయితే ఎండకు రోజా నీరసించిపోయారు. దీంతో ఫుట్‌పాత్‌పైనే ఆమె సేదతీరారు. ఫుట్‌పాత్‌పై టవల్ పరుచుకుని అక్కడే నిద్రపోయారు. వైఎస్ జగన్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి రోజాను పరామర్శించారు. అనంతరం రోజాను 108 అంబులెన్ లో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు . రోజాను ఎందుకు సభలోకి అనుమతించడం లేదో చెప్పాలంటూ నినాదాలు చేశారు. అప్పటికే రెండుసార్లు సభను వాయిదా వేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. మూడోసారి సమావేశమైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగింది. ఇంతలోనే రోజా రోడ్డుపైనే నిద్రపోవడం వంటి పరిణామాలతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేసేశారు.
Click on Image to Read: