ఫుట్‌పాత్‌పై ఒంటరిగా రోజా బైఠాయింపు
హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తనను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంతో రోజా నిరసనకు దిగారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట రోడ్డుమీద ఫుట్ పాత్ పై ఒంటరిగా నిరసనకు దిగారు. అక్కడే బైఠాయించారు. కోర్టు తీర్పు తర్వాత కూడా తనను ఎందుకు అనుమతించడం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. రోజాకు మద్దతుగా వైసీపీ సభ్యులు సభలో పోరాటం చేస్తున్నారు. రోజాను అనుమతించాలంటూ సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభను అడ్డుకున్నారు. దీంతో సభను స్పీకర్ రెండుసార్లు వాయిదా […]
హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తనను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంతో రోజా నిరసనకు దిగారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట రోడ్డుమీద ఫుట్ పాత్ పై ఒంటరిగా నిరసనకు దిగారు. అక్కడే బైఠాయించారు. కోర్టు తీర్పు తర్వాత కూడా తనను ఎందుకు అనుమతించడం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. రోజాకు మద్దతుగా వైసీపీ సభ్యులు సభలో పోరాటం చేస్తున్నారు. రోజాను అనుమతించాలంటూ సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభను అడ్డుకున్నారు. దీంతో సభను స్పీకర్ రెండుసార్లు వాయిదా వేశారు. సభ వాయిదా పడిన సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు రోజా వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అంతకు ముందు సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రోజాను అసెంబ్లీ గేటు వద్దనే మార్షల్స్ అడ్డుకున్నారు.
అటు పరిస్థితి మరింత జఠిలం అవడంతో సీనియర్ నేతలతో స్పీకర్ కోడెల సమావేశం నిర్వహించారు. స్పీకర్ తీరుపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి ఆడది స్వేచ్చగా రోడ్డుపై తిరగాలని నాడు గాంధీ ఆకాంక్షిస్తే చంద్రబాబు మాత్రం పట్టపగలు మహిళ ఎమ్మెల్యేను సభలో రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు.
తాము ఇప్పటివరకు 20 సార్లు ప్రివిలేజెస్ కమిటీకి ఫిర్యాదుచేసినా ఒక్కసారి కూడా విచారణకు ఆదేశించలేదని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.. బుచ్చయ్య చౌదరి ఎంత అసభ్యంగా మాట్లాడుతూ మహిళలను కించపరిచారో చూశామని, ఆయనపై ఫిర్యాదుచేసినా చర్యలు లేవన్నారు.. బోండా ఉమా అయితే ‘మిమ్మల్ని పాతేస్తాం’ అన్నా ఆ మాటలను కనీసం రికార్డు నుంచి తొలగించలేదన్నారు. మరోమంత్రి ఉమా ‘మిమ్మల్ని తగలబెట్టేస్తాం, అంతుచూస్తాం’ అన్నా చర్యలు తీసుకోలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు … రోజా సస్పెన్షన్ విషయంలో సభ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని చెప్పడాన్ని శ్రీకాంత్ రెడ్డి తప్పుపట్టారు… ప్రతిపక్షం పూర్తిగా వ్యతిరేకించినా అది ఏకగ్రీవం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
Click on Image to Read: