Telugu Global
Cinema & Entertainment

రేపట్నుంచి పని మొదలుపెట్టనున్న చరణ్

రామ్ చరణ్ మరోసారి లొకేషన్ లోకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఇన్నాళ్లూ సోదరి వివాహ ఏర్పాట్లలో బిజీ అయిపోయిన చెర్రీ…. తన కొత్త సినిమాకు సంబంధించి మరోసారి కాల్షీట్లు కేటాయించాడు. రేపట్నుంచి యూరోప్ లో ఈ సినిమా షెడ్యూల్ ఉంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో థని ఒరువన్ అనే తమిళ సినిమాకు రీమేక్ గా చెర్రీ సినిమా రాబోతోంది. ఈ రీమేక్ కు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఇటీవల ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్ లో భాగంగా […]

రామ్ చరణ్ మరోసారి లొకేషన్ లోకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఇన్నాళ్లూ సోదరి వివాహ ఏర్పాట్లలో బిజీ అయిపోయిన చెర్రీ…. తన కొత్త సినిమాకు సంబంధించి మరోసారి కాల్షీట్లు కేటాయించాడు. రేపట్నుంచి యూరోప్ లో ఈ సినిమా షెడ్యూల్ ఉంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో థని ఒరువన్ అనే తమిళ సినిమాకు రీమేక్ గా చెర్రీ సినిమా రాబోతోంది. ఈ రీమేక్ కు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఇటీవల ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్ లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి యూరోప్ వెళ్తున్నాడు చెర్రీ. అక్కడ కొన్ని పాటలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. వీలైనంత తొందరగా షూట్ పూర్తిచేసి, తిరిగి సోదరి వివాహానికి హాజరవ్వాలని చరణ్ భావిస్తున్నాడు. వివాహం అయిపోయిన తర్వాత హైదరాబాద్ లోనే మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాదాపు 40 రోజుల పాటు జరిగే ఈ భారీ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ పూర్తిచేయాలని అనుకుంటున్నారు. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత.
First Published:  18 March 2016 6:31 PM IST
Next Story