ఊపిరిలో తమన్నా సొంత గొంతు
తమన్నా ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుందనే విషయం అందరికీ తెలుసు. లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు ఎంతో మంది హీరోలు ఆమె తెలుగు విని తెగ ముచ్చటపడ్డారు. తెలుగమ్మాయిలు కూడా ఇంత బాగా మాట్లాడలేరని మెచ్చుకున్నారు. దీంతో తమన్న తన కొత్త సినిమాకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున-కార్తి హీరోలుగా నటించిన ఊపిరి సినిమాలో హీరోయిన్ గా నటించింది తమన్న. ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ […]
BY sarvi18 March 2016 11:56 AM IST
X
sarvi Updated On: 18 March 2016 12:18 PM IST
తమన్నా ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుందనే విషయం అందరికీ తెలుసు. లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు ఎంతో మంది హీరోలు ఆమె తెలుగు విని తెగ ముచ్చటపడ్డారు. తెలుగమ్మాయిలు కూడా ఇంత బాగా మాట్లాడలేరని మెచ్చుకున్నారు. దీంతో తమన్న తన కొత్త సినిమాకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున-కార్తి హీరోలుగా నటించిన ఊపిరి సినిమాలో హీరోయిన్ గా నటించింది తమన్న. ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటానని దర్శకుడ్ని కోరిందట తమన్న. వంశీ వెంటనే ఒప్పుకోవడంతో తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తమన్నా వాయిస్ విన్న వంశీ పైడిపల్లి… ఆమెతో తమిళ్ లో కూడా డబ్బింగ్ చెప్పించాడు. ఇలా రెండు భాషల్లో తన సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకొని తోటి హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచింది మిల్కీబ్యూటీ.
Next Story