అది విని చిరంజీవి షాక్ అయ్యాడట
చిరంజీవి నటించిన కాలంలో హీరోలదే డామినేషన్. అతడు చేసిన చివరాఖరి సినిమా వరకు హీరోయిన్లకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండేది. హీరోయిన్లు కోటి దాటి ఎప్పుడో కోటిన్నరకు వెళ్లిపోయారనే విషయాన్ని చిరంజీవి ఆ నోటా ఈ నోటా వింటూనే ఉన్నాడు. కానీ తన సినిమాకే హీరోయిన్ కు రికార్డు మొత్తాన్ని చదివించుకోవాల్సి వస్తుందని మాత్రం మెగాస్టార్ కలలో కూడా ఊహించి ఉండడు. నయనతారకు ఇచ్చిన రేటు చూసి చిరుకు ఒక్కక్షణం కళ్లు తిరిగాయట. ఇదేంటి… ఆమెకు ఇంతిచ్చారని […]
BY admin18 March 2016 2:22 AM IST
X
admin Updated On: 18 March 2016 5:08 AM IST
చిరంజీవి నటించిన కాలంలో హీరోలదే డామినేషన్. అతడు చేసిన చివరాఖరి సినిమా వరకు హీరోయిన్లకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండేది. హీరోయిన్లు కోటి దాటి ఎప్పుడో కోటిన్నరకు వెళ్లిపోయారనే విషయాన్ని చిరంజీవి ఆ నోటా ఈ నోటా వింటూనే ఉన్నాడు. కానీ తన సినిమాకే హీరోయిన్ కు రికార్డు మొత్తాన్ని చదివించుకోవాల్సి వస్తుందని మాత్రం మెగాస్టార్ కలలో కూడా ఊహించి ఉండడు. నయనతారకు ఇచ్చిన రేటు చూసి చిరుకు ఒక్కక్షణం కళ్లు తిరిగాయట. ఇదేంటి… ఆమెకు ఇంతిచ్చారని కళ్లు పెద్దవి చేసి అడిగాడట. తప్పలేదు సార్ అనే సమాధానం మాత్రమే యూనిట్ నుంచి వచ్చింది. చిరు 150వ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించనుంది. చిరంజీవికున్న స్టార్ డమ్ చూసి ఆమె నటించడానికి ఒప్పుకోలేదు. కేవలం రెమ్యునరేషన్ చూసి మాత్రమే ఒప్పుకుంది. ఇప్పటివరకు దక్షిణాదిన ఏ హీరోయిన్ కు ఇవ్వని రీతిలో… నయనతారకు రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చారని సమాచారం. అందుకే కాల్షీట్లు కేటాయించినట్టు చెబుతున్నారు. ఈ ఎమౌంట్ కే చిరంజీవికి కళ్లుతిరిగాయట.
Next Story