అభయ్ ని బైక్‌మీద తీసుకువెళ్లింది సాయి... అయినా మరెన్నో అనుమానాలు!
టిఫిన్ తెచ్చుకుంటానని ఇంట్లోంచి వెళ్లి అట్ట పెట్టె లో శవమై కనిపించిన అభయ్ హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పదికోట్లు ఇస్తే బాలుడిని వదిలేస్తామని చెప్పిన కిడ్నాపర్లు చివరికి ఐదుకోట్లకు దిగారు. ఫోనులో బేరసారాలు ఆడుతూనే, రాత్రికి రాత్రే బాలుడిని హత్య చేసి శవాన్ని అట్టపెట్లో పెట్టి సికిందరాబాద్‌లో రోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు ఈ కేసుని భిన్న కోణాల్లోంచి పరిశీలిస్తున్నారు. అభయ్‌ని బండిమీద ఎక్కించుకుని తీసుకువెళ్లిన వ్యక్తిని సాయి గా గుర్తించారు. రాజమండ్రిలో పోలీసులు సాయిని […]
టిఫిన్ తెచ్చుకుంటానని ఇంట్లోంచి వెళ్లి అట్ట పెట్టె లో శవమై కనిపించిన అభయ్ హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పదికోట్లు ఇస్తే బాలుడిని వదిలేస్తామని చెప్పిన కిడ్నాపర్లు చివరికి ఐదుకోట్లకు దిగారు. ఫోనులో బేరసారాలు ఆడుతూనే, రాత్రికి రాత్రే బాలుడిని హత్య చేసి శవాన్ని అట్టపెట్లో పెట్టి సికిందరాబాద్‌లో రోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు ఈ కేసుని భిన్న కోణాల్లోంచి పరిశీలిస్తున్నారు. అభయ్‌ని బండిమీద ఎక్కించుకుని తీసుకువెళ్లిన వ్యక్తిని సాయి గా గుర్తించారు. రాజమండ్రిలో పోలీసులు సాయిని అరెస్టు చేశారు. అంతకుముందు పోలీసులు అతడిని గుర్తించిన వారికి లక్షరూపాయల బహుమతిని ప్రకటించారు. సాయి గతంలో అభయ్ తండ్రి రాజ్‌కుమార్ మోదాని వద్ద పనిచేశాడని, తరువాత మానేసినా వారి ఇంటికి సమీపంలోనే ఉంటున్నాడని తెలుస్తోంది. రాజ్‌కుమార్ మోదానీ హైదరాబాద్ గోషామహల్‌కి చెందిన వ్యక్తి. ఆయనకు ప్లాస్టిక్ పరిశ్రమ ఉంది. అభయ్ ఆయనకున్న ఇద్దరు కవలపిల్లల్లో ఒకడు. పదవతరగతి చదువుతున్నాడు.
బండిమీద అభయ్‌ని తీసుకువెళ్లిన వ్యక్తి ఎవరో తేలడంతో ఈ కేసులో చిక్కుముడి వీడినట్టే కనిపిస్తున్నా, ఇంకా ఇందులో పోలీసుల అనుమానాలకు పూర్తి సమాధానాలు దొరకడం లేదు. సాయి, అభయ్ తండ్రి వద్ద పనిచేసి ఉంటే అతడిని అభయ్ కుటుంబ సభ్యులు ఎవరూ గుర్తుపట్టకపోవడం వెనుక ఉన్న కారణం ఇంకా తెలియరాలేదు. పైగా అభయ్ తన బండిని కిడ్నాప్ చేసిన వ్యక్తికి ఇచ్చి, అతని వెనుక కూర్చుని వెళ్లాడు. ఎంతో కొంత పరిచయం లేకుండా అలా చేసే అవకాశం లేదు. అభయ్ కుటుంబ సభ్యులు హత్య విషయంలో పోలీసుల ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. రాజ్‌కుమార్ మోదానీకి బంధువుల్లో గానీ, వ్యాపారంలో గానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా, అనే కోణంలో పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో డబ్బు కంటే కిడ్నాపర్ల లక్ష్యం వేరే ఉందనే విధంగా జరిగిన పరిణామాలు ఉన్నాయి. అభయ్ కిడ్నాప్, హత్య కేసులో నిందితుల కోసం 15 ప్రత్యేక బృందాలతో గాలింపులు జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఏడుగురు నిందితులను వారు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం.