ప్రియాంకా చోప్రాకి స్ఫూర్తినిచ్చిన పోలీస్ ఆఫీసర్...ఇషా పంత్!
జై గంగాజల్ హిందీ సినిమాలో ప్రియాంకా చోప్రా అత్యంత ధైర్యసాహసాలు, నీతి నిజాయితీలు ఉన్న టఫ్ పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఈ పాత్రని దర్శకుడు ప్రకాష్ ఝా, ఇషాపంత్ అనే పోలీసు అధికారిణి నిజజీవిత అంశాల ఆధారంగా రూపొందించారు. పలుమార్లు ఇషాపంత్‌ని కలిసి ఆమె గురించి తెలుసుకున్నాడు. ప్రియాంకా చోప్రాకు పోలీస్ పాత్ర ధారణలో స్ఫూర్తిగా నిలిచిన ఈ సాహసి గురించి కొన్ని విషయాలు- ఇషాపంత్ 2011 ఐపిఎస్ బ్యాచ్ ఆఫీసర్. భోపాల్‌కి చెందిన ఆమె మధ్యప్రదేశ్ […]
జై గంగాజల్ హిందీ సినిమాలో ప్రియాంకా చోప్రా అత్యంత ధైర్యసాహసాలు, నీతి నిజాయితీలు ఉన్న టఫ్ పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఈ పాత్రని దర్శకుడు ప్రకాష్ ఝా, ఇషాపంత్ అనే పోలీసు అధికారిణి నిజజీవిత అంశాల ఆధారంగా రూపొందించారు. పలుమార్లు ఇషాపంత్‌ని కలిసి ఆమె గురించి తెలుసుకున్నాడు. ప్రియాంకా చోప్రాకు పోలీస్ పాత్ర ధారణలో స్ఫూర్తిగా నిలిచిన ఈ సాహసి గురించి కొన్ని విషయాలు-
- ఇషాపంత్ 2011 ఐపిఎస్ బ్యాచ్ ఆఫీసర్. భోపాల్‌కి చెందిన ఆమె మధ్యప్రదేశ్ కేడర్‌లో చేరారు.
- మొదట జబల్‌పూర్‌లో అడిషనల్ సూపరెంటెండెంట్‌గా పనిచేశారు, ప్రస్తుతంలో గ్వాలియర్‌లో పనిచేస్తున్నారు.
- యుపిఎస్‌సి పరీక్షల్లో ఆలిండియా 191వ ర్యాంకు సాధించారామె. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో పోలీసు ట్రైనింగ్ తీసుకున్నారు. 2012లో బెస్ట్ ఆల్ రౌండ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ప్రొబేషనర్‌గా అవార్డు అందుకున్నారు.
- జబల్‌పూర్‌లో డ్రగ్ మాఫియా, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారు.
- మొత్తం నలుగురు అక్కాచెల్లెళ్లలో ఇషాపంత్ ఆఖరి అమ్మాయి. అక్కాచెల్లెళ్లు అందరూ ధైర్యసాహసాలున్నవారే. అందరికంటే పెద్ద అమ్మాయి ఐఎఫ్ఎస్ అధికారిణి, రెండవ సోదరి హ్యూమన్ రీసోర్స్‌లో పనిచేస్తున్నారు, మూడవసోదరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో స్క్వాడ్రాన్ లీడర్.
- వీరి తండ్రి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఇషా పంత్ భర్త అనిరుధ్ శ్రావణ్ కర్ణాటక కేడర్‌లో ఐఎఎస్ అధికారిగా పనిచేస్తున్నారు.