Telugu Global
International

అమెరికా సుప్రీం అవ‌కాశం...భార‌త‌ సంత‌తి వ్య‌క్తికి ద‌క్కలేదు!

అమెరికా సుప్రీం కోర్టు జ‌డ్జిగా భార‌తసంత‌తికి చెందిన శ్రీనివాస‌న్‌కే  అవ‌కాశం ద‌క్కుతుంద‌ని కొన్ని రోజులుగా  ప్ర‌చారం జ‌రుగుతున్నా అది నిజం కాలేదు.   ఆ అవ‌కాశం శ్రీనివాస‌న్‌కి కాకుండా మెర్రిక్ గార్లాండ్‌కు ద‌క్కింది. మెర్రిక్ గార్లాండ్‌ని అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా నామినేట్ చేశారు.  సంప్రదాయవాది జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా (79) మృతి చెందడంతో ఆ స్థానంలో భారత సంతతికి చెందిన జడ్జి శ్రీనివాసన్‌కు అవకాశం లభిస్తుంద‌ని గ‌త‌నెల‌లో ఆయ‌న‌పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది.  మరో […]

అమెరికా సుప్రీం అవ‌కాశం...భార‌త‌ సంత‌తి వ్య‌క్తికి ద‌క్కలేదు!
X

అమెరికా సుప్రీం కోర్టు జ‌డ్జిగా భార‌తసంత‌తికి చెందిన శ్రీనివాస‌న్‌కే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్నా అది నిజం కాలేదు. ఆ అవ‌కాశం శ్రీనివాస‌న్‌కి కాకుండా మెర్రిక్ గార్లాండ్‌కు ద‌క్కింది. మెర్రిక్ గార్లాండ్‌ని అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా నామినేట్ చేశారు. సంప్రదాయవాది జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా (79) మృతి చెందడంతో ఆ స్థానంలో భారత సంతతికి చెందిన జడ్జి శ్రీనివాసన్‌కు అవకాశం లభిస్తుంద‌ని గ‌త‌నెల‌లో ఆయ‌న‌పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. మరో కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేసే ఒబామా, జడ్జి నియామక నిర్ణయాన్ని తన వారసుడికి అప్పగించాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు కోరారు కానీ, తనకు రాజ్యాంగ పరంగా లభించిన హక్కులను వినియోగించుకుంటానని ఒబామా చెబుతూ వ‌చ్చారు.

la-na-obama-merrick-remarks-20160ఒబామా దృష్టిలో శ్రీనివాస‌న్‌దే ప్రథమ స్థానం అని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ అప్ప‌ట్లో తెలిపింది. కొంతమంది రిపబ్లికన్లు కూడా తన అభిమతానికి మద్దతిస్తారని ఒబామా ఆశిస్తున్నార‌ని కూడా సీఎన్‌ఎన్ పేర్కొంది. డీసీ సర్క్యూట్ కోర్టు అప్పీల్స్ జడ్జిగా ఉన్న శ్రీనివాసన్, ఒబామా నామినీల రేసులో ముందువరుసలో ఉన్నారని ఆ వార్తా సంస్థ తెలిపింది. శ్రీనివాసన్ నామినేషన్ గతంలోనే సెనేట్ ఆమోదం పొందిందని కూడా విశ్లేషకులు అన్నారు. ఇన్ని జ‌రిగాక, ఆ అవ‌కాశం శ్రీనివాస‌న్‌కే ద‌క్కుతుంద‌ని అంతా అనుకుంటూ ఉండ‌గా, అది అనూహ్యంగా మెర్రిక్ గార్లాండ్‌ను వ‌రించింది. చివ‌రి నిముషం వ‌ర‌కు ఒబామా, శ్రీనివాస‌న్‌కే అవ‌కాశం ఇస్తార‌ని భావించినా అది జ‌ర‌గ‌లేదు. వైట్ హౌస్‌లోని రోజ్ గార్డెన్లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఒబామా అమెరికా సుప్రీం జ‌డ్జిగా గార్లాండ్ పేరుని ప్ర‌క‌టించారు. ఆయ‌న సుప్రీం కోర్టుకి నైతిక‌త‌, గొప్ప‌ద‌నం, పార‌ద‌ర్శ‌క‌త‌ల‌ను తీసుకువ‌స్తార‌ని ఒబామా ఆయ‌నను ప్ర‌శంసించారు.

ఒబామా నిర్ణ‌యం వెనుక ఎన్నిక‌ల ప్ర‌భావం ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల సంవ‌త్సరం క‌నుక ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని సెనేట్ రిప‌బ్లిక‌న్లు ఒబామాని హెచ్చ‌రించారు. ఒబామా, డెమోక్రాట్లు మ‌రో ప‌దినెల‌లు స‌మ‌యం ఉంది క‌దాని, తొలుత ఉపేక్షించారు. కానీ త‌రువాత అనేక చ‌ర్చ‌లు, త‌ర్జ‌న భ‌ర్జ‌నల అనంత‌రం ఒబామా, మెర్రిక్ గార్లెండ్ పేరుని ప్ర‌క‌టించారు. గార్లాండ్ హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీ నుండి న్యాయ‌శాస్త్రంలో ప‌ట్టా పొందాడు. క్లింట‌న్ అధ్య‌క్షుడిగా ఉన్న‌పుడు న్యాయ‌ప‌ర‌మైన ఉన్న‌త ప‌ద‌విని నిర్వ‌హించారు.

First Published:  17 March 2016 10:31 AM IST
Next Story