మొత్తానికి ఓ భారీ మల్టీస్టారర్ రాబోతోంది....
రూమర్లు అయితే వినిపిస్తున్నాయి…. కథనాలు కనిపిస్తున్నాయి… దర్శకుల పేర్లు కూడా నలుగుతున్నాయి. కానీ ఏ దర్శకుడు ఎవరితో సినిమా చేస్తాడనే విషయంపై మాత్రం క్లారిటీ రావట్లేదు. లిస్ట్ లో మాత్రం రాజమౌళి, త్రివిక్రమ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అ..ఆ సినిమా అయిపోయిన తర్వాత…. తెలుగు-తమిళ భాషల్లో ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. దీనికి సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజమౌళి కూడా బాహుబలి -2 తర్వాత భారీ […]
BY admin17 March 2016 3:00 AM IST
X
admin Updated On: 17 March 2016 3:40 AM IST
రూమర్లు అయితే వినిపిస్తున్నాయి…. కథనాలు కనిపిస్తున్నాయి… దర్శకుల పేర్లు కూడా నలుగుతున్నాయి. కానీ ఏ దర్శకుడు ఎవరితో సినిమా చేస్తాడనే విషయంపై మాత్రం క్లారిటీ రావట్లేదు. లిస్ట్ లో మాత్రం రాజమౌళి, త్రివిక్రమ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అ..ఆ సినిమా అయిపోయిన తర్వాత…. తెలుగు-తమిళ భాషల్లో ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. దీనికి సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజమౌళి కూడా బాహుబలి -2 తర్వాత భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కుదిరితే తెలుగు-హిందీ-తమిళ భాషలకు చెందిన బడా స్టార్లతో మల్టీస్టారర్ సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడట. ఈ విషయంపై ఇప్పటికే తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో రాజమౌళి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు బడా దర్శకుల్లో ఎవరు మల్టీస్టారర్ తో మన ముందుకొస్తారో చూడాలి.
Next Story