మేడమ్ టుస్సాడ్స్‌లో మోడీ!
ప్రముఖ అంతర్జాతీయ మైనపు విగ్రహాల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో మోడీ విగ్రహం నెలకొల్పనున్నారు. మ్యూజియం ప్రతినిధులు ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న సెలబ్రిటీలు, చరిత్రకారులు, దేశాధినేతలు మొదలైనవారి మైనపు విగ్రహాలు ఇక్కడ ప్రతిష్టిస్తుంటారు. అచ్చంగా మనుషులే అని భ్రమించేలా ఉండే ఈ విగ్రహాలు చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. లండన్‌కేంద్రంగా స్థాపితమైన ఈ మ్యూజియంలలో మైనపు విగ్రహం పెట్టడం అంటే దాన్ని అరుదైన గౌరవంగానే భావించాలి. అందుకే మోడీ తనను ఈ విషయమై సంప్రదించినపుడు, తాను […]
ప్రముఖ అంతర్జాతీయ మైనపు విగ్రహాల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో మోడీ విగ్రహం నెలకొల్పనున్నారు. మ్యూజియం ప్రతినిధులు ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న సెలబ్రిటీలు, చరిత్రకారులు, దేశాధినేతలు మొదలైనవారి మైనపు విగ్రహాలు ఇక్కడ ప్రతిష్టిస్తుంటారు. అచ్చంగా మనుషులే అని భ్రమించేలా ఉండే ఈ విగ్రహాలు చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. లండన్‌కేంద్రంగా స్థాపితమైన ఈ మ్యూజియంలలో మైనపు విగ్రహం పెట్టడం అంటే దాన్ని అరుదైన గౌరవంగానే భావించాలి. అందుకే మోడీ తనను ఈ విషయమై సంప్రదించినపుడు, తాను అందుకు సరితూగే వ్యక్తినా… అనే సందేహం వ్యక్తం చేశారని, తాము ఒప్పించామని టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తెలిపారు. వారు మోడీ శరీర కొలతలను సైతం తీసుకున్నారు. విగ్రహ ఏర్పాటుకి సంబంధించి మోడీ తమకు ఎంతగానో సహకరించారని, తమ పనితీరుపై ప్రశంసలు కురిపించారని టూస్సాడ్స్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలు 20 ఉన్నాయి. వీటిలో పదింటిలో మోడీ విగ్రహాలు నెలకొల్పుతారు. ఏప్రిల్ నాటికి ఈ పని పూర్తవుతుంది. ఇప్పటివరకు ఈ మ్యూజియంలలో మనదేశపు బాలివుడ్ తారలు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ వంటి వారి విగ్రహాలతో పాటు దక్షిణాఫ్రికా నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిట్లర్, సద్దామ్ హుస్సేన్ లాంటి ప్రముఖుల విగ్రహాలు సైతం నెలకొల్పారు.