Telugu Global
Health & Life Style

మెట్లెక్కితే... మెదడుకెంతో  ఆరోగ్యం!

మెట్లు ఎక్కితే శ‌రీరానికి మంచిద‌ని, చ‌క్క‌ని వ్యాయామం అందుతుంద‌ని మ‌న‌కు తెలుసు. కానీ మెట్లు ఎక్క‌డం వ‌ల‌న మెద‌డుకి కూడా చాలా మేలు క‌లుగుతుంద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. అలాగే ఎంత‌కాలం మ‌నం ఏదోఒక‌టి చ‌దువుకుంటూ, నేర్చుకుంటూ  ఉంటామో అంత‌కాలం మ‌న మెద‌డు ఆరోగ్య‌వంతంగా ఉంటుంద‌ని కూడా వీరు చెబుతున్నారు. చ‌దువుకుంటూ పోతున్న‌పుడు మెద‌డు వ‌య‌సు సంవ‌త్స‌రానికి 0.95సంవ‌త్స‌రం వ‌ర‌కు త‌గ్గుతూ ఉంటుంద‌ట‌. అలాగే ప్ర‌తిరోజూ మెట్లు ఎక్క‌డంతో 0.58సంవ‌త్స‌రం మేర‌కు మెద‌డు వ‌య‌సు త‌గ్గిపోయి చురుగ్గా, ఆరోగ్యంగా […]

మెట్లెక్కితే... మెదడుకెంతో  ఆరోగ్యం!
X

మెట్లు ఎక్కితే శ‌రీరానికి మంచిద‌ని, చ‌క్క‌ని వ్యాయామం అందుతుంద‌ని మ‌న‌కు తెలుసు. కానీ మెట్లు ఎక్క‌డం వ‌ల‌న మెద‌డుకి కూడా చాలా మేలు క‌లుగుతుంద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. అలాగే ఎంత‌కాలం మ‌నం ఏదోఒక‌టి చ‌దువుకుంటూ, నేర్చుకుంటూ ఉంటామో అంత‌కాలం మ‌న మెద‌డు ఆరోగ్య‌వంతంగా ఉంటుంద‌ని కూడా వీరు చెబుతున్నారు.

చ‌దువుకుంటూ పోతున్న‌పుడు మెద‌డు వ‌య‌సు సంవ‌త్స‌రానికి 0.95సంవ‌త్స‌రం వ‌ర‌కు త‌గ్గుతూ ఉంటుంద‌ట‌. అలాగే ప్ర‌తిరోజూ మెట్లు ఎక్క‌డంతో 0.58సంవ‌త్స‌రం మేర‌కు మెద‌డు వ‌య‌సు త‌గ్గిపోయి చురుగ్గా, ఆరోగ్యంగా త‌యార‌వుతుంద‌ట‌. ఇప్ప‌టికే మెట్లు ఎక్కితే ఆరోగ్యానికి ఎంతోమంచిద‌నే సంగ‌తిని చాలామంది గుర్తించి పాటిస్తున్నారు. ఇప్పుడు వ‌య‌సు పెరుగుతున్న‌వారు త‌ప్ప‌కుండా మెట్లు ఎక్కుతూ మెద‌డుని చురుగ్గా ఉంచుకోవాల‌ని ఈ ప‌రిశోధ‌కులు స‌ల‌హా ఇస్తున్నారు.

మెట్లు ఎక్కుతున్న వారిలో, చ‌దువుకుంటున్న వారిలో మెద‌డులోని నాడీ క‌ణ‌జాలం సంకోచించ‌కుండా, దాని ప‌రిమాణం త‌గ్గ‌కుండా ఉన్న‌ట్టుగా గ‌మ‌నించారు. ప్ర‌తిరోజూ మెట్లుఎక్క‌డం, ఏదోఒక‌టి చ‌దువుతూ, నేర్చుకుంటూ ఉండ‌టంతో మెద‌డుని ప‌దిలంగా ఉంచుకోవ‌చ్చ‌ని వీరు చెబుతున్నారు. మెట్లు ఎక్క‌డం అనే సులువైన వ్యాయామం మెద‌డుకి ఇంత అద్భుత‌మైన మేలు చేయ‌డం ప‌ట్ల శాస్త్ర‌వేత్త‌లే ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిశోధ‌న‌ని కెన‌డాలోని ఓ యూనివ‌ర్శిటీకి చెందిన సైంటిస్టులు నిర్వ‌హించారు.

First Published:  16 March 2016 12:38 PM IST
Next Story