వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఊరట, సుప్రీం ఆగ్రహం
అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమె పిటిషన్‌పై విచారణ జరపాలంటూ హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశించింది. పిటిషన్‌ను బుధవారం ఉదయం 10 గంటలకు విచారించాలని ఆదేశించింది. అదే సమయంలో హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్య చేసింది సుప్రీం బెంచ్. గోపాలగౌడ, అరుణ్ మిశ్రాతో కూడిన బెంచ్ ఈ మేరకు […]
అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమె పిటిషన్‌పై విచారణ జరపాలంటూ హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశించింది. పిటిషన్‌ను బుధవారం ఉదయం 10 గంటలకు విచారించాలని ఆదేశించింది. అదే సమయంలో హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్య చేసింది సుప్రీం బెంచ్. గోపాలగౌడ, అరుణ్ మిశ్రాతో కూడిన బెంచ్ ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఈ- మెయిల్ ద్వారా పంపనున్నట్టు వెల్లడించింది. రోజా పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
నిబంధనలను ఉల్లంఘించి వ్యవస్థలను ఎలా నడుపుతారని ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాదిపై న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే మొండిగా వాదిస్తే తామే నేరుగాపిటిషన్‌ను విచారిస్తామని హెచ్చరించారు. ఒక ప్రజాప్రతినిధి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అంటూ హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఏపీ ప్రభుత్వ న్యాయవాదిపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ నుంచి రోజా ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. దీనిపై ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లగా అక్కడ న్యాయం జరగడం లేదంటూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
Click on Image to Read: