Telugu Global
Health & Life Style

విక్స్ యాక్ష‌న్ 500 ఎక్స్‌ట్రా ఇక‌రాదు!

విక్స్ యాక్ష‌న్ 500 ఎక్స్‌ట్రా… ఈ మందు ప్ర‌క‌ట‌నల ద్వారా మ‌న‌కు సుప‌రిచితం. దీని ఉత్పత్తి సంస్థ ప్రొక్ట‌ర్ అండ్ గ్యాంబుల్ త‌మ ఔష‌ధ ఉత్ప‌త్తి, అమ్మ‌కాల‌ను నిలిపివేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. భార‌త ప్ర‌భుత్వం ఫిక్స్‌డ్ డోస్ కాంబినేష‌న్‌తో ఉన్న మందుల‌పై బ్యాన్ విధించ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. రెండుమూడు ర‌కాల ఔష‌ధాల‌ను క‌లిపి ఒకే మందుగా త‌యారుచేస్తే వాటిని ఫిక్స్‌డ్ డోస్ కాంబినేష‌న్ అంటారు. అలాగే కోరెక్స్‌, ఫెన్సిడిల్ అనే […]

విక్స్ యాక్ష‌న్ 500 ఎక్స్‌ట్రా ఇక‌రాదు!
X

విక్స్ యాక్ష‌న్ 500 ఎక్స్‌ట్రా… ఈ మందు ప్ర‌క‌ట‌నల ద్వారా మ‌న‌కు సుప‌రిచితం. దీని ఉత్పత్తి సంస్థ ప్రొక్ట‌ర్ అండ్ గ్యాంబుల్ త‌మ ఔష‌ధ ఉత్ప‌త్తి, అమ్మ‌కాల‌ను నిలిపివేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. భార‌త ప్ర‌భుత్వం ఫిక్స్‌డ్ డోస్ కాంబినేష‌న్‌తో ఉన్న మందుల‌పై బ్యాన్ విధించ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. రెండుమూడు ర‌కాల ఔష‌ధాల‌ను క‌లిపి ఒకే మందుగా త‌యారుచేస్తే వాటిని ఫిక్స్‌డ్ డోస్ కాంబినేష‌న్ అంటారు. అలాగే కోరెక్స్‌, ఫెన్సిడిల్ అనే ద‌గ్గు మందుల ఉత్ప‌త్తిని సైతం ఆయా ఉత్ప‌త్తి కంపెనీలు ఫిజ‌ర్‌, అబాట్‌లు నిలిపివేశాయి.

దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న 344 కాంబినేషన్ ఔషధాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. కోరెక్స్, ఫెన్సిడిల్ వంటి దగ్గు మందుల వాడకంతో అనేక నష్టాలు కలుగుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత నిషేధాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాంబినేషన్ ఔషధాలు మెదడుకు హాని క‌లిగిస్తున్నాయ‌ని తేల‌డంతో ఈ నిషేధాన్ని విధించిన‌ట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అత్యధికంగా వాడ‌కంలో ఉన్న క్లోఫెనిరామిన్ మలీట్, కొడైన్ లు కలిగిన కోరెక్స్ దగ్గుమందు బ్రాండ్ ను వెంటనే బ్యాన్ చేయాలని ప్ర‌భుత్వం త‌న తాజా నోటిఫికేష‌న్‌లో తెలిపింది. నిపుణుల కమిటిల సిఫార్సుల మేరకు ప్ర‌జా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ఔషధాల ఉత్పత్తి, అమ్మకాలతోపాటు పంపిణీపైనా నిషేధం విధించ‌డం జ‌రిగింద‌ని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఫిజ‌ర్‌, అబాట్‌లు…ఈ రెండు కంపెనీలు ప్ర‌భుత్వ నిషేధాన్ని అడ్డుకునే మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని ప్ర‌క‌టించాయి. ప్ర‌భుత్వ నిర్ణ‌యం త‌మ కంపెనీల‌ ఆదాయం, లాభాల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని ఈ కంపెనీలు పేర్కొన్నాయి.

కాగా ఫిజ‌ర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేసి కోరెక్స్ అమ్మ‌కాల నిషేధంపై స్టే తెచ్చుకుంది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌లునుండి డిసెంబ‌రు వ‌ర‌కు అంటే తొమ్మిది నెల‌ల పాటు 176కోట్లు రూపాయ‌ల కోరెక్స్ అమ్మ‌కాలు జ‌రిగినట్టుగా ఫిజ‌ర్, స్టేకు ముందు ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కోరెక్స్ గ‌త ముప్ప‌యి సంవ‌త్స‌రాలుగా ఇండియాలో సుర‌క్షిత‌మైన మందుగా పేరు తెచ్చుకుంద‌ని ఫిజ‌ర్ తెలిపింది.

First Published:  15 March 2016 12:21 PM IST
Next Story