ఆన్ లైన్ ను టార్గెట్ చేసిన పవన్
ప్రచారంలో పవన్ ది ఎప్పూడూ సంప్రదాయ పద్ధతే. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం… ప్రచారం కోసం పోస్టర్లు, సినిమా విడుదలకు ముందు ట్రయిలర్ విడుదల చేయడం…. కుదిరితే పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం…. ఇలా పద్ధతి ప్రకారమే పవన్ ప్రచారం ఉండేది. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో తొలిసారిగా పవన్ తన ప్రచార పంథాను మార్చాడు. తన కొత్త సినిమా కోసం ఎక్కువగా ఆన్ లైన్ మీద ఆధారపడుతున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ కంటే ముందే కొన్ని […]
ప్రచారంలో పవన్ ది ఎప్పూడూ సంప్రదాయ పద్ధతే. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం… ప్రచారం కోసం పోస్టర్లు, సినిమా విడుదలకు ముందు ట్రయిలర్ విడుదల చేయడం…. కుదిరితే పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం…. ఇలా పద్ధతి ప్రకారమే పవన్ ప్రచారం ఉండేది. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో తొలిసారిగా పవన్ తన ప్రచార పంథాను మార్చాడు. తన కొత్త సినిమా కోసం ఎక్కువగా ఆన్ లైన్ మీద ఆధారపడుతున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ కంటే ముందే కొన్ని ఫొటోలు విడుదల చేయడం… తాజాగా ఆడియో విడుదలకు ముందే మరికొన్ని వర్కింగ్ స్టిల్స్ విడుదల చేయడం చేస్తున్నాడు.
ప్రస్తుతానికైతే సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ మొత్తం సోషల్ మీడియాలోనే నడుస్తోంది. ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉండే కల్యాణ్…. ఈమధ్యే కాస్త ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా దొరుకుతున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ కు కూడా అన్ని టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సిద్ధమౌతున్నాడు. ఈనెల 23వ తేదీ నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రచార కార్యక్రమం మొదలవుతుంది.
Click on Image to Read: