అమెజాన్...ఆడవాళ్లు...ఓ అవకాశం!
కొత్త ప్రయత్నాలు చేయడంలో ఆడవాళ్లు ఎప్పుడూ వెనుకంజ వేయరు. కొత్త వంటలు చేసినంత తేలిగ్గా వారు ఇప్పుడు నూతన వృత్తులు చేపడుతున్నారు. అలాంటి ఔత్సాహిక మహిళలకు అమెజాన్ ఆన్‌లైన్ రిటైల్ సంస్థ చక్కని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. వారిచేత సరుకు డెలివరీ చేయించే పనిని సమర్ధవంతంగా చేయిస్తోంది. తిరువనంతపురంలో ఏడుగురు మహిళలతో ఆల్ ఉమెన్ డెలివరీ స్టేషన్ నడుస్తోంది. వీరంతా కస్టమర్లకు తమ టు వీలర్ల మీద వెళ్లి సరుకు డెలివరీ చేస్తుంటారు. ఈ అవకాశాన్ని ఎక్కువగా […]
కొత్త ప్రయత్నాలు చేయడంలో ఆడవాళ్లు ఎప్పుడూ వెనుకంజ వేయరు. కొత్త వంటలు చేసినంత తేలిగ్గా వారు ఇప్పుడు నూతన వృత్తులు చేపడుతున్నారు. అలాంటి ఔత్సాహిక మహిళలకు అమెజాన్ ఆన్‌లైన్ రిటైల్ సంస్థ చక్కని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. వారిచేత సరుకు డెలివరీ చేయించే పనిని సమర్ధవంతంగా చేయిస్తోంది. తిరువనంతపురంలో ఏడుగురు మహిళలతో ఆల్ ఉమెన్ డెలివరీ స్టేషన్ నడుస్తోంది. వీరంతా కస్టమర్లకు తమ టు వీలర్ల మీద వెళ్లి సరుకు డెలివరీ చేస్తుంటారు. ఈ అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది హోమ్‌మేకర్లుగా ఇళ్లలో ఉంటున్న మహిళలే.
ఇంట్లోంచి బయటకు వచ్చి పనిచేయడం కుదరదు అనుకున్న వారు కూడా తమకు అనుకూలమైన సమయాల్లో ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పనులు మేము చేయగలమా… అని ముందు సందేహించిన వారే అత్యంత సమర్ధవంతంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఈ పనితో డబ్బు సంపాదనతో పాటు ఇంటిపనులకు సమయం కూడా సరిపోతున్నదని 37ఏళ్ల దీప్తి ప్రమోద్ అంటున్నారు. అలాగే సంధ్య (34) తనవల్ల ఈ పని అవుతుందా అనుకున్నారు ముందు. కస్టమర్లకు కాల్ చేయడం, వారు కోరిన విధంగా సామగ్రి డెలివరీ చేయడం, ముఖ్యంగా బ్యాగులతో టూ వీలర్లను నడపడం వీటన్నింటినీ ఈ మహిళలు శిక్షణ, సాధనలతో చాలా త్వరగా నేర్చుకుంటున్నారు.
అమెజాన్ స్టేషన్ మేనేజర్ దివ్య, ఖాళీలు ఉన్నాయా అని అడుగుతూ మహిళలు చేస్తున్న ఫోన్‌కాల్స్ తనకు నిరంతరం వస్తూనే ఉన్నాయంటున్నారు. టువీలర్‌ని నడపగలిగి ఉండటం. ఆంగ్లం తెలిసి ఉండటం… ఈ రెండే వీరికి కావలసిన అర్హతలు. ఒక్కో మహిళ తాము పనిచేస్తున్న వర్క్ స్టేషన్ నుండి రెండు, మూడు కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేస్తూ రోజుకి 40 వరకు ప్యాకేజీలను డెలివరీ చేస్తున్నారు. ఈ మహిళలకు తమతోటి మగ కొలీగ్స్ శిక్షణనిచ్చి సహకరిస్తున్నారు.