నా రేటు రూ. 30 కోట్లు, మంత్రి పదవి " వైసీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
తనపై టీడీపీ ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ గుట్టును విజయనగరం జిల్లా సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర బయటపెట్టారు. టీడీపీ నాయకులు తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆయన చెప్పారు. తొలుత రూ.5 కోట్లు ఇస్తామని చెప్పిన టీడీపీ నేతలు అనంతరం ఆ రేటును మరింత పెంచారని వెల్లడించారు. రూ. 5 కోట్లకు తాను స్పందించకపోయే సరికి రూ. 15 కోట్లతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు టీడీపీ నేతలు సిద్ధమన్నారని రాజన్నదొర చెప్పారు. ఆఖరికి రూ. 30 […]

తనపై టీడీపీ ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ గుట్టును విజయనగరం జిల్లా సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర బయటపెట్టారు. టీడీపీ నాయకులు తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆయన చెప్పారు. తొలుత రూ.5 కోట్లు ఇస్తామని చెప్పిన టీడీపీ నేతలు అనంతరం ఆ రేటును మరింత పెంచారని వెల్లడించారు. రూ. 5 కోట్లకు తాను స్పందించకపోయే సరికి రూ. 15 కోట్లతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు టీడీపీ నేతలు సిద్ధమన్నారని రాజన్నదొర చెప్పారు. ఆఖరికి రూ. 30 కోట్లు ఇచ్చేందుకు టీడీపీ నేతలు ముందుకొచ్చారని వెల్లడించారు. అయితే తాను లొంగలేదని వివరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాలూరులో కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రలోభాలకు లొంగి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని వివరించారాయన. అధికార పార్టీలో ఇమడలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు.
Click on Image to Read: