Telugu Global
Health & Life Style

హెల్మెట్ ఎందుకు, ఎలా ధరించాలంటే

హెల్మెట్ వాడకం తప్పనిసరి చేశారు కాబట్టి, ఏదో నెత్తి మీద చిప్ప బోర్లిన్చుకున్నట్లు మొక్కుబడిగా తల మీద పెట్టుకుంటున్నారు కానీ చాలా మంది అతి ముఖ్యమైన “స్ట్రాప్” పెట్టుకోవడం మర్చిపోతున్నారు అనే కంటే కావాలనే “ఇగ్నోర్” చేసినట్లు కనిపిస్తుంది. దీని వల్ల ప్రమాదాలు జరిగినపుడు హెల్మెట్ పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. అత్యున్నత వైద్య సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఏదో మొక్కుబడిగా కాకుండా మంచి బ్రాండేడ్ (ఐ.ఎస్.ఐ) హెల్మెట్ పెట్టుకొని , “స్ట్రాప్” కూడా పెట్టుకోవడం […]

హెల్మెట్ ఎందుకు, ఎలా ధరించాలంటే
X

హెల్మెట్ వాడకం తప్పనిసరి చేశారు కాబట్టి, ఏదో నెత్తి మీద చిప్ప బోర్లిన్చుకున్నట్లు మొక్కుబడిగా తల మీద పెట్టుకుంటున్నారు కానీ చాలా మంది అతి ముఖ్యమైన “స్ట్రాప్” పెట్టుకోవడం మర్చిపోతున్నారు అనే కంటే కావాలనే “ఇగ్నోర్” చేసినట్లు కనిపిస్తుంది. దీని వల్ల ప్రమాదాలు జరిగినపుడు హెల్మెట్ పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. అత్యున్నత వైద్య సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఏదో మొక్కుబడిగా కాకుండా మంచి బ్రాండేడ్ (ఐ.ఎస్.ఐ) హెల్మెట్ పెట్టుకొని , “స్ట్రాప్” కూడా పెట్టుకోవడం చాలా అవసరం. హెల్మెట్ ని “సోల్ మేట్” లా భావించడం చాలా మంచిది కానీ “హెల్-మేట్” లా భావించడం కష్టాలను కొని తెచ్చుకోవటమే. హెల్మెట్ పెట్టుకోకపోవడానికి వివిధ రకాల కారణాల్లో జుట్టు ఊడిపోతుందని, లేక తల నొప్పిగా ఉంటుందని చెప్తుంటారు. అవి కొంత వరకు నిజమే కావొచ్చు కానీ , ఈ సమస్యల కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మొత్తానికి “తల” ఉంటేనే కదా జుట్టయినా, తల నొప్పైనా….. కానీ “తలే లేకపోతే”……. సో హెల్మెట్ ధరించండి. స్ట్రాప్ పెట్టుకోండి. తలను రక్షించుకోండి.

First Published:  13 March 2016 2:55 PM IST
Next Story