Telugu Global
NEWS

వైఎస్‌, బాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మన్మోహన్‌ సింగ్‌ సలహాదారు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ మీడియా సలహాదారు సంజయ్‌ బారు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాను మన్మోహన్ సింగ్‌ వద్ద ఉన్నప్పుడు తన సమక్షంలో జరిగిన కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. 2009లో రాష్ట్ర విభజన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వైఎస్‌ తన అభిప్రాయాన్ని సూటిగా ప్రధానితో చెప్పారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్‌ రెండు ప్రాంతాల్లో తుడిచిపెట్టుకుపోతుందని వైఎస్‌ చెప్పారట. రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రా, రాయలసీమలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తుందని… అదే సమయంలో విభజన […]

వైఎస్‌, బాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మన్మోహన్‌ సింగ్‌ సలహాదారు
X

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ మీడియా సలహాదారు సంజయ్‌ బారు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాను మన్మోహన్ సింగ్‌ వద్ద ఉన్నప్పుడు తన సమక్షంలో జరిగిన కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. 2009లో రాష్ట్ర విభజన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వైఎస్‌ తన అభిప్రాయాన్ని సూటిగా ప్రధానితో చెప్పారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్‌ రెండు ప్రాంతాల్లో తుడిచిపెట్టుకుపోతుందని వైఎస్‌ చెప్పారట. రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రా, రాయలసీమలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తుందని… అదే సమయంలో విభజన క్రెడిట్ మొత్తం కేసీఆర్‌కు వెళ్తుందని దాని వల్ల తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని మన్మోహన్‌ సింగ్‌తో వైఎస్ చెప్పారని సంజయ్ బారు వెల్లడించారు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానన్నారు. అప్పుడు వైఎస్‌ చెప్పిందే ఇప్పుడు నిజమైందని సంజయ్ అభిప్రాయపడ్డారు. వైఎస్‌ ముందుగానే పరిస్థితిని అంచనా వేయగలిగారన్నారు.

రాష్ట్ర విభజన వల్ల ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందా లేదా అన్న ప్రశ్నకు సంజయ్ బారు … చంద్రబాబును ఉదాహరణ తీసుకుని పరిస్థితిని వివరించారు. ”రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌ జైట్లీలతో చంద్రబాబు ఢిల్లీలో సమావేశమైన దృశ్యాలను నేను టీవీల్లో చూశా. మీరు గమనించారో లేదో గానీ రాజ్‌నాథ్‌, అరుణ్‌ జైట్లీలను కలిసినప్పుడు చంద్రబాబు కూర్చీ అంచుల్లో ఒంగి కూర్చున్నారు. అదే సమయంలో రాజ్‌నాథ్‌, అరుణ్‌ జైట్లీలు కాలిమీదకాలు వేసుకుని కూర్చున్నారు. చంద్రబాబు ఇలా కూర్చోవడాన్ని ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో నేను ఎన్నడూ చూడలేదు” అని అన్నారు. పరోక్షంగా రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలో తెలుగు నేతల పలుకుబడి పడిపోయిందని ఈ ఉదాహరణ ద్వారా సంజయ్‌ బారు తెలియజేసినట్టుగా ఉంది.

ఢిల్లీలో నెట్టుకురావాలంటే సంఖ్యాబలం చాలా ముఖ్యమన్నారు. నరేంద్ర మోదీ ఇప్పటికి ప్రజాదరణ ఉన్న నేతగానే సంజయ్ బారు అభివర్ణించారు. ఈపరిస్థితి కారణం మరో బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడమేనని అన్నారు. నెహ్రు, ఇందిరా గాంధీలను ఉత్తమ ప్రధానులుగా అభివర్ణించారాయన. రాజీవ్‌ గాంధీని విఫల ప్రధాని అని అన్నారు. పీవీ నర్సింహారావు విజయవంతమైన ప్రధాని అన్నారు. వాజ్‌పేయి ఒక బాధ్యతయుతమైన ప్రధాని అని సంజయ్ బారు అన్నారు.

Click on Image to Read:

jagan

babu

ysrcp-tdp1

bjp-tdp1

ysrcp

reporters

vijaymalya

ysrcp1

madhupriya

jagan

jagan-case-involved

roja1

bjp-president

jagan-sakshi

photo

bandla-ganesh

123

First Published:  13 March 2016 4:35 AM GMT
Next Story