మాల్యా సంగతి సరే....ఎయిర్ ఇండియా గురించి మాట్లాడరా?
మీడియా విజయ్ మాల్యాని ఉతికి ఆరేస్తున్న సమయంలో…ఆయనకు అనుకూలంగా అనికాదు కానీ…మాల్యా నేర తీవ్రతని కాస్త తగ్గించే విధమైన వ్యాఖ్యానం ఒకటి బయటకు వచ్చింది. గతంలో ఇన్ఫోసిస్‌లో ఉన్నత స్థానంలో పనిచేసిన టివి మోహన్‌దాస్ పాయి ఈ వాదనను తెచ్చారు. మాల్యా ఏగవేసిన తొమ్మిదివేల కోట్ల గురించి ఇంతగా మాట్లాడుతున్న వారు, ఎయిర్ ఇండియాకు వచ్చిన 30వేల కోట్ల నష్టం గురించి మాట్లాడరెందుకని…అని అయన ప్రశ్నించారు. కింగ్‌ఫిషర్ నష్టానికి విజయ్ మాల్యాని కారణంగా చూపినట్టుగానే, ఎయిర్ ఇండియా […]
మీడియా విజయ్ మాల్యాని ఉతికి ఆరేస్తున్న సమయంలో…ఆయనకు అనుకూలంగా అనికాదు కానీ…మాల్యా నేర తీవ్రతని కాస్త తగ్గించే విధమైన వ్యాఖ్యానం ఒకటి బయటకు వచ్చింది. గతంలో ఇన్ఫోసిస్‌లో ఉన్నత స్థానంలో పనిచేసిన టివి మోహన్‌దాస్ పాయి ఈ వాదనను తెచ్చారు. మాల్యా ఏగవేసిన తొమ్మిదివేల కోట్ల గురించి ఇంతగా మాట్లాడుతున్న వారు, ఎయిర్ ఇండియాకు వచ్చిన 30వేల కోట్ల నష్టం గురించి మాట్లాడరెందుకని…అని అయన ప్రశ్నించారు. కింగ్‌ఫిషర్ నష్టానికి విజయ్ మాల్యాని కారణంగా చూపినట్టుగానే, ఎయిర్ ఇండియా నష్టానికి కారణం అయినవారు ఎవరో… వారిని పట్టుకుని ఎందుకు నిలదీయరు అని మోహన్‌దాస్ అన్నారు. విజయ్‌మాల్యా పదివేల కోట్లు బ్యాంకు డబ్బుని కొల్లగొడితే, ఎయిర్ ఇండియా నష్టంతో ఈ దేశంలోని పన్ను చెల్లింపు దారులు ఆ మేరకు నష్టపోయారని…అంతకుమించి ఇద్దరికీ తేడా ఏముందని దాస్ అన్నారు.
అంతా విజయ్ మాల్యా వెంటబడే వారే..కానీ ప్రభుత్వ సంస్థలో నష్టం వస్తే మాత్రం పరవాలేదా, పార్లమెంటులో కూడా దీని గురించి ఎవరూ ఒక్కమాట కూడా మాట్లాడరు, మీడియా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది…. ఎయిర్ ఇండియా, విజయ్ మాల్యా ఇద్దరూ ఒకే బోటులో ప్రయాణం చేస్తున్నవారు. మరి ఒకరిని ప్రశ్నించి, మరొకరిని వదిలేయడం హిపోక్రసి కాదా అని మోహన్‌దాస్ అన్నారు.
మాల్య తిరిగి వచ్చి తన ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, బ్యాంకు బకాయిల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా తాను మాత్రం విలాసవంతమైన జీవితం గడపటంపై మాల్యాను మోహన్‌దాస్ విమర్శించారు. ప్రభుత్వం మాల్యాని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని, ఆయన తిరిగి వచ్చి తన ఆర్థిక వ్యవహారాలను పరిష్కరించమని కోరాలని మోహన్ దాస్ అన్నారు. మోహన్ దాస్ ప్రస్తుతం ఆరిన్ క్యాపిటల్, మణిపాల్ ఎడ్యుకేషన్ సంస్థలకు ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో ఆయన ప్రత్యక్ష పన్నుల సంస్కరణలకోసం నియమితమైన కేల్కర్ కమిటీ బృందంలో సభ్యుడిగా ఉన్నారు.