నీరు చాలని మెదడు… చిక్కిపోతుందట!
శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. మనిషి అందం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం…ఇవన్నీ నీటితోనే ముడిపడి ఉన్నాయి. లండన్లోని కింగ్స్ కాలేజి సైకియాట్రి డిపార్ట్‌మెంట్ వారు పరిశోధనలు నిర్వహించినపుడు మెదడుకి సరిపడా నీరు అందని టీనేజర్లలో మెదడు కుచించుకుపోయినట్టుగా గమనించారు. వారిని పరీక్షించినపుడు, నీరు తాగిన పిల్లలతో సమానంగా తెలివితేటలు ప్రదర్శించలేకపోయారు. మెదడు దాని సహజ పరిమాణంలో ఉండాలంటే మనం తగిన నీరు తాగాలని దీన్ని బట్టి తెలుస్తోంది. అలాగే […]
శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. మనిషి అందం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం…ఇవన్నీ నీటితోనే ముడిపడి ఉన్నాయి. లండన్లోని కింగ్స్ కాలేజి సైకియాట్రి డిపార్ట్‌మెంట్ వారు పరిశోధనలు నిర్వహించినపుడు మెదడుకి సరిపడా నీరు అందని టీనేజర్లలో మెదడు కుచించుకుపోయినట్టుగా గమనించారు. వారిని పరీక్షించినపుడు, నీరు తాగిన పిల్లలతో సమానంగా తెలివితేటలు ప్రదర్శించలేకపోయారు. మెదడు దాని సహజ పరిమాణంలో ఉండాలంటే మనం తగిన నీరు తాగాలని దీన్ని బట్టి తెలుస్తోంది. అలాగే మంచినీటి వలన కలిగే మరింత మంచి గురించి చెప్పాలంటే-
- నీరు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉంటాయి. యూరినరీ, కొలోన్ క్యాన్సర్లు, హార్ట్ ఎటాక్స్‌ని నివారించవచ్చు.
- శరీరంలో తగిన నీరు ఉంటే మెటబాలిక్ రేటు, అంటే కేలరీలు ఖర్చయ్యే వేగం పెరుగుతుంది.
- భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగితే 75నుండి 90 కేలరీల వరకు తక్కువ ఆహారం తీసుకుంటాం. అంటే నీరు తాగని వారు ఎక్కువ ఆహారం తింటున్నట్టే చెప్పాలి.
- నీరు ఎక్కువగా తాగితే శరీరం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. తాగకపోతే శరీరం మీద సన్నని ముడతలు ఏర్పడతాయి. చర్మం రంగూ తగ్గుతుంది.
- మసాచుసెట్స్‌లో ఒక యూనివర్శిటీ పరిశోధకులు కొంతమంది మహిళలు, పురుషుల చేత దాదాపు గంటపాటు వ్యాయామం చేయించారు అదీ సరిపడా నీరు ఇవ్వకుండా. అలాగే కొంతమందికి తగిన నీళ్లు ఇచ్చి వ్యాయామం చేయమన్నారు. తరువాత గమనిస్తే నీరు తాగని వారిలో అలసట, గందరగోళం, కోపం, టెన్షన్, డిప్రెషన్ తదితర లక్షణాలను గమనించారు. నీరు తాగినవారిలో ఇవేమీ లేవు.